ETV Bharat / sitara

'ఆదిపురుష్' షూటింగ్ ఇకపై హైదరాబాద్​లో! - ప్రభాస్ ఓం రౌత్ ఆదిపురుష్

డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న 'ఆదిపురుష్' షూటింగ్​ను ఇకపై హైదరాబాద్​లో చేయాలని చిత్రబృందం భావిస్తోంది. మహారాష్ట్రలో సినిమా షూటింగ్​లపై తాత్కాలిక నిషేధమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

Adipurush coming to Hyderabad?
ఆదిపురుష్ బృందం
author img

By

Published : May 7, 2021, 2:59 PM IST

కరోనా సెకండే వేవ్​ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్​లు నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబయిలో ఉన్న 'ఆదిపురుష్' బృందం.. ఇప్పుడు హైదరాబాద్​కు వచ్చే ఆలోచనలో ఉంది.

Adipurush movie team
ఆదిపురుష్ చిత్రబృందం

ముంబయిలోని ఫిల్మ్​సిటీలో ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు రెండు నెలలపాటు 'ఆదిపురుష్' షూటింగ్ జరిగింది. కొత్త షెడ్యూల్​ మొదలుపెడదామనే సమయానికి మహారాష్ట్రలో కొవిడ్ కేసులు పెరుగుతూ వచ్చాయి. దీని దృష్ట్యా షూటింగ్​లపై రాష్ట్ర ప్రభుత్వం స్టే విధించింది. దీంతో దాదాపు 90 రోజుల పాటు జరగబోయే కొత్త షెడ్యూల్​ను హైదరాబాద్​లో పూర్తి చేయాలని 'ఆదిపురుష్' బృందం భావిస్తోంది.

రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సైఫ్​ అలీఖాన్​ రావణుడిగా నటిస్తున్నారు. కృతిసనన్ సీతగా కనిపించనున్నారు. ఓం రౌత్ దర్శకుడు. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

prabhas Adipurush movie
ప్రభాస్​తో దర్శకుడు ఓం రౌత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.