ETV Bharat / sitara

ప్రభాస్​ 'సలార్' టైటిల్​ అర్థం ఇదే..​ - salar title meaning

ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో ప్రభాస్​ నటించబోతున్న కొత్త సినిమా 'సలార్'​. బుధవారం అధికారికంగా ప్రకటించారు. టైటిల్ కొత్తగా ఉండటం వల్ల దాని​ అర్థం తెలుసుకునే పనిలో బిజీ అయ్యారు డార్లింగ్​ అభిమానులు. ఇంతకీ ఆ అర్థం ఏంటంటే?

Salar
సలార్
author img

By

Published : Dec 3, 2020, 9:33 AM IST

'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్​ నీల్- ప్రభాస్​ కాంబోలో 'సలార్'​ అనే కొత్త సినిమా రానున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. 'అత్యంత క్రూరమైన వ్యక్తి' అని పోస్టర్​కు క్యాప్షన్​ జోడించారు. దీంతో డార్లింగ్​ అభిమానులు టైటిల్​ అర్థాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు.

salar
సలార్​

అర్థం ఇదే..

ఈ సినిమా బహుభాషా చిత్రం. అందుకే అన్ని భాషలకు సెట్టయ్యేలా 'సలార్' టైటిల్ నిర్ణయించారు. ఇది ఒక ఉర్దూ పదం. ధైర్యవంతుడైన నాయకుడు, దారిచూపువాడు అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే బలమైన నాయకుడన్నమాట.

'సలార్' షూటింగ్‌ను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ప్రారంభం కానుంది. హొంబాలే ఫిల్మ్స్​ బ్యాన‌ర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

ప్రస్తుతం ప్రభాస్​.. ఈ సినిమాతో కలిపి నాలుగు వైవిధ్య కథల సినిమాలు చేస్తున్నారు. అందులో రాధేశ్యామ్(రొమాంటిక్), ఆదిపురుష్(మైథాలజీ), నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ ఉన్నాయి.

ఇదీ చూడండి : బాక్సాఫీస్​పై ప్రభాస్ దండయాత్ర.. ఒక్కో సినిమా ఒక్కోలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.