ETV Bharat / sitara

'రాంబో'లో టైగర్​కు బదులుగా ప్రభాస్​! - రాంబోలో హీరోగా ప్రభాస్​

డార్లింగ్​ ప్రభాస్​ హీరోగా 'రాంబో' సినిమాను రూపొందించేందుకు బాలీవుడ్​ దర్శకుడు సిద్దార్థ్​ ఆనంద్​ సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ కథకు ముందుగా టైగర్​ ష్రాఫ్​ను అనుకున్నా.. ఆ హీరోకు కాల్షీట్లు సర్దుబాటు చేయలేని కారణంగా ఈ ఆఫర్​ ప్రభాస్​కు వెళ్లినట్లు తెలుస్తోంది.

Prabhas replace Tiger Shroff in Rambo movie
'రాంబో'లో టైగర్​కు బదులుగా ప్రభాస్​!
author img

By

Published : Mar 31, 2021, 9:54 PM IST

సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడిగా 'రాంబో' సినిమా చేస్తున్నట్లు మూడేళ్ల క్రితమే ప్రకటన వచ్చింది. సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన 'రాంబో' చిత్రానికి ఇది రీమేక్‌. అంతేకాదు సినిమాకు సంబంధించి పోస్టర్ సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. టైగర్‌ ష్రాఫ్‌ - హృతిక్‌ రోషన్‌ కలిసి నటించిన 'వార్‌' చిత్రం తర్వాత చిత్రాన్ని పట్టాలెక్కించాలని సిద్ధార్థ్ ఆనంద్‌ భావించారట.

Prabhas replace Tiger Shroff in Rambo movie
'రాంబో' ఫస్ట్​లుక్​

అయితే టైగర్‌ 'రాంబో' కోసం కాల్షీట్స్​ని సర్దుబాటు చేయడం లేదట. దీంతో 'బాహుబలి' హీరో ప్రభాస్‌ను 'రాంబో' సినిమా కోసం దర్శకుడు సిద్ధార్థ్ సంప్రదించారట. కథతో పాటు వారు చెప్పిన కాన్సెప్ట్ ప్రభాస్‌కి నచ్చిందట. ఈ నేపథ్యంలో ప్రభాస్​-సిద్దార్థ్​ ఆనంద్​ కాంబినేషన్​లో 'రాంబో' ప్రాజెక్టు పట్టాలెక్కనుందని ప్రచారం జరుగుతోంది. దీని గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి: 'తలైవి' సాంగ్​ అప్​డేట్​.. 'వై' ట్రైలర్​ రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.