ETV Bharat / sitara

చేతులు కలిపిన ప్రభాస్-దీపిక.. 'బీస్ట్' షూటింగ్ ప్యాకప్

author img

By

Published : Dec 11, 2021, 7:35 PM IST

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ప్రభాస్ ప్రాజెక్టు K, విజయ్ బీస్ట్, అల్లు అర్జున్ పుష్ప, ఎటర్నల్స్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

cinema news
సినిమా న్యూస్

Prabhas project K movie: ప్రభాస్ కొత్త సినిమా 'ప్రాజెక్టు K'. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రభాస్, దీపిక చిత్రీకరణలో పాల్గొన్నట్లు వెల్లడించారు. వారిద్దరూ చేతులు పట్టుకున్న వీడియోను శనివారం పోస్ట్ చేశారు.

సైన్స్ ఫిక్షన్ కథతో తీస్తున్న ఈ సినిమాకు 'మహానటి' ఫేమ్ నాగ్​ అశ్విన్ దర్శకుడు. వైజయంతీ మూవీస్​ బ్యానర్​లో అశ్వనీదత్.. భారీ బడ్జెట్​తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. 2023లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

దీనితో పాటు 'రాధేశ్యామ్', 'సలార్', 'ఆదిపురుష్' సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. వీటి తర్వాత 'స్పిరిట్' చిత్రం చేస్తారు.

Vijay beast movie: విజయ్ 'బీస్ట్' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని వెల్లడించిన చిత్రబృందం.. దర్శకుడు నెల్సన్ దిలీప్​ కుమార్-విజయ్ హగ్ చేసుకున్న ఫొటోను పోస్ట్ చేసింది.

vijay nelson dileep kumar beast
బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్​తో విజయ్

ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​గా చేసింది. అనిరుధ్ సంగీతమందించారు. సన్​పిక్చర్ నిర్మించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

Allu arjun pushpa: అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్​కు రంగం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్​లోని యూసఫ్​గూడలో ఈ కార్యక్రమం జరగనుంది. అయితే దీనికి వచ్చే గెస్ట్​లు ఎవరనేది ఇంతవరకు వెల్లడించలేదు.

pushpa pre release event
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్

శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. 'పుష్ప' తొలి భాగం డిసెంబరు 17న పాన్ ఇండియా రేంజ్​లో విడుదల కానుంది.

*ఇటీవల థియేటర్లలో సందడి చేసిన హాలీవుడ్​ భారీ సినిమా 'ఎటర్నల్స్'. ఇప్పుడు ఓటీటీలోనూ అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. జనవరి 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్ ఈ చిత్రం స్ట్రీమింగ్ చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ క్రమంలోనే పోస్టర్​ కూడా రిలీజ్ చేశారు.

eternals OTT release date
ఎటర్నల్స్ ఓటీటీ రిలీజ్ డేట్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.