ETV Bharat / sitara

Salar movie: ఒక్క ఫైట్ సీన్ కోసం అన్ని కోట్లా? - సలార్​ సినిమా ఫైట్​ సీక్వెన్స్​

Prabhas Salar movie: ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న​ 'సలార్' సినిమా ప్రస్తుతం షూటింగ్​ జరుపుకుంటోంది. అయితే ఇటీవలే డార్లింగ్​తో ఓ భారీ యాక్షన్​ సీన్​ను చిత్రీకరించారట. దీని కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది.

prabhas salar movie
ప్రభాస్​ సలార్​ సినిమా
author img

By

Published : Jan 17, 2022, 4:29 PM IST

Prabhas Salar movie: 'కేజీఎఫ్'లో​ ఊహకందని విజువల్స్, భారీ యాక్షన్​ సీన్స్​తో సంచలనం సృష్టించారు దర్శకుడు ప్రశాంత్​ నీల్​. ప్రస్తుతం ఆయన పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​తో 'సలార్​' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ప్రభాస్​ లుక్స్​ చూస్తే.. ఇది కూడా యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందబోతున్నట్లు అర్థమవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఇటీవల నీల్​.. డార్లింగ్​ చేత ఓ భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారట. దీని కోసం ఏకంగా రూ.20కోట్లు ఖర్చు చేశారని తెలిసింది! ఇదే ఈ మూవీకి హైలెట్​గా నిలవనుందని సినీవర్గాల సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ఇక ఈ చిత్రంలో శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటిస్తోంది. ప్రభాస్​ ద్విపాత్రాభినయం చేస్తున్నారని వినికిడి. శ్రద్ధాకపూర్​తో స్పెషల్​ సాంగ్​ కూడా ఉంటుందని సమాచారం.

ఇదీ చూడండి: 'ఆర్​సీ 15' నాన్​ థియేట్రికల్​ రైట్స్​కు రికార్డు ధర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.