ETV Bharat / sitara

డార్లింగ్ ప్రభాస్ సంక్రాంతికి బరిలో ఉంటాడా? - Prabhas new movies list

హీరో ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని అనుకున్నారు. పక్కా షెడ్యూల్​ తీర్చిదిద్దారు. కానీ కరోనా వాటిని మార్చేసింది. దీంతో ఈ సినిమా పండక్కి వస్తుందా? రాదా? అనే సందేహాలు తలెత్తున్నాయి.

prabhas
'జాన్​'గా ప్రభాస్​ సంక్రాంతికి తెరపై కనిపిస్తాడా?
author img

By

Published : Apr 3, 2020, 5:37 AM IST

డార్లింగ్ హీరో ప్రభాస్‌ ప్రస్తుతం ఓ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు. యూరప్​ నేపథ్యంతో సాగే కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చారు. తొలుత ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో ఆ తేదీ మారే సూచనలు కనిపిస్తున్నాయి. వస్తుందా? రాదా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఎట్టిపరిస్థితుల్లోనైనా సంక్రాంతికే!

మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనైనా అనుకున్న సమయానికే చిత్రాన్ని తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.

ఇప్పటికే వైజయంతి మూవీస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నాడు ప్రభాస్​. ప్రస్తుత చిత్రం ఆలస్యమైతే దాని ప్రభావం.. ఆ సినిమాపై పడే అవకాశముంది.

ఇదీ చదవండి: సెట్​లో ప్రభాస్ అలా ఉంటాడు: పూజా హెగ్డే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.