యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కర్ణాటకలోని పలువురు ప్రభాస్ అభిమానులు ప్రత్యేకత చాటుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్రభుత్వ కిడ్వాయి కేన్సర్ ఆస్పత్రి ఆవరణలో ఔషధ గుణాలున్న అడవిని సృష్టించబోతున్నారు.
![Prabhas Karnataka fans Green India Challenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9379622_pra-2.jpg)
ఇందుకోసం వెయ్యి చదరపు అడుగుల స్థలాన్ని దత్తత తీసుకున్న ఆ అసోసియేషన్ అధ్యక్షుడు అశ్విన్ రెడ్డి.. అందులో వివిధ రకాల ఔషధ గుణాలున్న మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దయ్యాక ఆస్పత్రి ఆవరణం ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుందని, కేన్సర్ బాధితులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని ప్రభాస్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు
![Prabhas Karnataka fans Green India Challenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9379622_pra-3.jpg)
![Prabhas Karnataka fans Green India Challenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9379622_1105_9379622_1604139174400.png)