Prabhas Attend RRR Premiere: ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా రేపటి నుంచి దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో తారక్, చరణ్, రాజమౌళిలు పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా సెట్లో జరిగిన సంఘటనలు, ఉక్రెయిన్ లో నాటునాటు పాట, పులితో జరిగిన పోరాట సన్నివేశాలు, ఆర్ఆర్ఆర్ విడుదల రోజు ఎక్కడ సినిమా చూడాలన్న ఆసక్తికర విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. రాజమౌళి నివాసంలో ఆద్యంతం నవ్వులు పూయిస్తూ సాగిన ఇంటర్వ్యూలో... తారక్ కింద కూర్చొని సందడి చేశారు.
ఈ వీడియోలో రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో ల గురించి చర్చించారు. దీనిలో భాగంగా ఎవరు ఎక్కడ చూస్తారు అని రాజమౌళి ఇద్దరిని అడుగుతారు. మీరు ఎక్కడ చూస్తే.. అక్కడే మేము కూడా అని ఎన్టీఆర్, చరణ్ అంటారు. అయితే నేను 'భ్రమరాంభ'లో చూస్తాను అని రాజమౌళి అనగా... ఇందుకు స్పందించిన ఎన్టీఆర్.. ప్రభాస్ వస్తారా అని అడిగారు. దీనికి సమాధానంగా జక్కన్న 'వద్దులే డార్లింగ్.. మీరు వెళ్లి రండి' అని ప్రభాస్ అంటారని రాజమౌళి చెప్పారు. ఇలాంటి సరదా ముచ్చట్లు ఈ వీడియో ఇంకా చాలా ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. 'ఆర్‌ఆర్‌ఆర్' సెన్సార్ పూర్తయింది. యూ/ఏ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి స్వరాలందించారు. కొవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మార్చి 25న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇదీ చూడండి: