ప్రపంచంలో వివిధ రంగాల్లో ఏదో అంశంపై వివిధ సంస్థలు సర్వేలు నిర్వహిస్తూ కొన్ని జాబితాలు విడుదల చేస్తుంటాయి. తాజాగా ఆసియా సెక్సీయెస్ట్ పురుషుల 2019 జాబితాను బ్రిటీష్ న్యూస్ వీక్లీ, ఈస్టర్న్ ఐ అనే సంస్థలు బుధవారం లండన్‌లో విడుదల చేశాయి. అందులో తెలుగు నటుడైన ప్రభాస్ పదో స్థానాన్ని దక్కించుకున్నాడు.
బ్రిటీష్ న్యూస్ వీక్లీ, ఈస్టర్న్ ఐ సంస్థలు సంయుక్తంగా ఈ జాబితాని నిర్వహించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల ఆన్‌లైన్ ఓట్ల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారట. ప్రభాస్ ఇందులో సెక్సీయెస్ట్ మ్యాన్‌గా స్థానం దక్కించుకున్నాడు. బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ మొదటి స్థానం సంపాదించుకోగా, దక్షిణాది నుంచి ఈ స్థానం దక్కించుకున్న ఏకైక నటుడు ప్రభాస్ ఒక్కడే కావడం గమనార్హం.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. మొత్తం మీద ప్రభాస్ పేరు మరోసారి ప్రస్తావనలోకి వచ్చింది. ఈ మధ్యనే తెరపైకి వచ్చిన 'సాహో'తో యాక్షన్ హీరోగా పేరు సంపాదించాడు యంగ్ రెబల్‌స్టార్. ప్రస్తుతం రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో 'జాన్' అనే చిత్రం చేస్తున్నాడు.
ఇవీ చూడండి.. భారీ బడ్జెట్ చిత్రానికి ఓకే చెప్పిన త్రిష