prabhas remuneration for spirit movie: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.. 'బాహుబలి' సిరీస్ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలను ఓకే చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. త్వరలోనే అవన్నీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ప్రస్తుతం డార్లింగ్ రెమ్యునరేషన్ గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో ప్రచారం సాగుతోంది.
ఇటీవలే ప్రభాస్ 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్ వంగాతో తన 25వ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు(spirit movie prabhas). దీనికి 'స్పిరిట్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీకి యంగ్ రెబల్‌స్టార్ ఏకంగా రూ.150కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే భారత్‌లో ప్రస్తుతం అంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకోనున్న ఏకైక నటుడు ప్రభాస్ మాత్రమే అవుతారు.
పాన్వరల్డ్గా రూపొందనున్న 'స్పిరిట్'.. యాక్షన్ థ్రిల్లర్‌గా రానుందని, ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం. 2022 చివర్లో లేదా 2023 ప్రారంభంలో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమవుతుందట.
ప్రభాస్.. జనవరి 14న రాధాకృష్ణ తెరకెక్కించిన 'రాధేశ్యామ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు(prabhas radhe shyam movie release date). దీంతో పాటు 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె' చిత్రాల్లోనూ నటిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ప్రభాస్‌తో అందుకే కుదరలేదు.. త్వరలోనే కలిసి పనిచేస్తాం'