అగ్రహీరో ప్రభాస్ నటించనున్న 'ఆదిపురుష్' నుంచి మరో అప్డేట్ వచ్చింది. భారతీయ ఇతిహాస కథతో తీయనున్న ఈ సినిమాలో ప్రతినాయకుడు లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన రాక్షసుడు ఇతడంటూ ట్విట్టర్లో చిత్రబృందం పోస్ట్ పెట్టింది.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిష్ణన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమై, 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.