ETV Bharat / sitara

ప్రైవేట్​ జెట్​లో హైదరాబాద్​కు వచ్చిన ప్రభాస్​? - Prabhas 20 news

ప్రపంచమంతా కరోనా దెబ్బకు వణికిపోతుంటే.. ప్రభాస్‌ 20వ సినిమా యూనిట్​ మాత్రం యూరప్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా అందరూ జార్జియా నుంచి ప్రైవేట్​ జెట్​లో స్వదేశానికి తిరుగుపయనమైనట్లు దర్శకుడు రాధాకృష్ణ వెల్లడించాడు. ఇప్పటికే హైదారాబాద్ చేరుకున్న పూజాహెగ్డే, ప్రియదర్శి 14 రోజులు స్వీయ నిర్భంధంలో ఉన్నారు.

Prabhas 20 movie completes Georgia schedule and rebal star and team reached to India in private jet?
ప్రైవేట్​ జెట్​లో హైదరాబాద్​కు పయనమైన ప్రభాస్​?
author img

By

Published : Mar 18, 2020, 7:42 PM IST

Updated : Mar 19, 2020, 4:01 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంటే.. సినీ ప్రముఖులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆయా ప్రభుత్వాలు కూడా ప్రజలు బయటకు రాకుండా ఆంక్షలు విధించాయి. ఇలాంటి సమయంలో ఇటీవలె ప్రభాస్‌ తన 20వ సినిమా కోసం చిత్రబృందంతో కలిసి యూరప్​ వెళ్లాడు. జాగ్రత్తలు తీసుకొని కొన్నాళ్లపాటు జార్జియాలో చిత్రీకరణలోనూ పాల్గొన్నాడు. తాజాగా అక్కడి షెడ్యూల్‌ పూర్తయినట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి.

Prabhas 20 movie completes Georgia schedule and rebal star and team reached to India in private jet?
ప్రైవేట్​జెట్​లో ప్రభాస్​

ఇప్పటికే ప్రయాణ ఆంక్షల కారణంగా ఈ హీరో ఎలా వస్తాడా? అని అందరూ భావించారు. అయితే చిత్రీకరణ అనంతరం ప్రైవేట్​ జెట్​లో హైదారాబాద్​కు పయనమైనట్లు చెప్తూ.. ఓ ఫొటో షేర్​ చేశాడు దర్శకుడు రాధాకృష్ణ. ఇందులో ప్రభాస్​తో పాటు చిత్ర నిర్మాత ప్రమోద్, నటుడు ప్రభాస్ శ్రీను తదితరులు ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్​ పూజాహెగ్డే, కీలకపాత్ర పోషిస్తున్న ప్రియదర్శి మంగళవారం భాగ్యనగరంలో అడుగుపెట్టారు. అనంతరం ఇద్దరూ 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. ప్రభాస్​తో పాటు చిత్రబృందం ఇదే తరహాలో క్వారంటైన్​లో ఉండే అవకాశముంది.

Prabhas 20 movie
పూజాహెగ్డే, ప్రియదర్శి

గోపీకృష్ణ మూవీస్‌, యువి క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఉగాది సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదలతో పాటు, పేరునూ ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. యూరప్‌ నేపథ్యంలో సాగే ఓ వైవిధ్యమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Mar 19, 2020, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.