అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షిత పార్వతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'నీకోసం'. అవినాష్ కోకటి దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 6న విడుదలవనుందీ సినిమా. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
'నీకోసం' చిత్రం ట్రైలర్ను చూసిన పవన్ ఇంప్రెస్ అయ్యాడు. ఈ చిత్ర విజయం కొత్త వాళ్లకు స్ఫూర్తిగా నిలవాలని అభిలషించాడు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం అన్నాడు పవన్.
ఇవీ చూడండి.. 'మహాభారతం'లో ప్రభాస్ ఈ పాత్ర చేస్తాడట..!