ETV Bharat / sitara

క్రిష్​ దర్శకత్వంలో పవర్​స్టార్ ద్విపాత్రాభినయం​! - పవన్​ కళ్యాణ్​ న్యూస్​

క్రిష్​ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ ద్విపాత్రాభినయం చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం నిజమైతే తన కెరీర్​లో ఇదే తొలి ద్విపాత్రాభినయ సినిమా అవుతుంది.

Power Star Pawan Kalyan Will lead Two Roles In Krish Direction
క్రిష్​ దర్శకత్వంలో ద్విపాత్రాభియం పోషిస్తున్న పవర్​స్టార్​!
author img

By

Published : Mar 27, 2020, 6:43 PM IST

పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పవన్‌.. 'వకీల్‌సాబ్‌'తో తెరపై రీఎంట్రీ ఇస్తున్నాడు. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. దీంతోపాటు క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. చరిత్ర నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలోనే పవన్‌ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పూర్తి స్పష్టత లేదు.

పవన్‌ తన కెరీర్‌లో ఇప్పటి వరకు ద్విపాత్రాభినయం చేయకపోవడం వల్ల ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. హీరోయిన్​ వివరాలను ఇప్పటివరకు ఖరారు చేయలేదు చిత్ర బృందం. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇదీ చూడండి.. "ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.