ETV Bharat / sitara

పవర్​ స్టార్-త్రివిక్రమ్​​ కాంబినేషన్​లో మరో చిత్రం​!

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, త్రివిక్రమ్​ కాంబినేషన్​లో మరో చిత్రం తెరకెక్కబోతోందా? అనే ప్రశ్నకు అవుననే అంటున్నాయి టాలీవుడ్​ వర్గాలు. త్రివిక్రమ్​ చెప్పిన స్టోరీలైన్​ నచ్చి పవన్​ దానికి అంగీకారం తెలిపాడని సమాచారం. స్క్రిప్ట్​ పనులు పూర్తవ్వగానే ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని చిత్రపరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

author img

By

Published : Jun 13, 2020, 5:31 AM IST

Power Star Pawan kalyan Wants to act once again under the direction of Trivikram!
మాటల మాంత్రికుడు దర్శకత్వంలో మరోసారి పవన్​!

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్​ కాంబినేషన్​లో మరో చిత్రం తెరకెక్కబోతుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పవన్​.. త్రివిక్రమ్​తో సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నారట. మాటల మాంత్రికుడు కథను వినిపించడం.. పవర్​స్టార్​ దానికి అంగీకరించడం చకచకా జరిగిపోయాయని సమాచారం. వీలైనంత త్వరగా స్క్రిప్ట్​ వర్క్​ను పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

పవన్​ కల్యాణ్​.. ప్రస్తుతం వేణు శ్రీరామ్​ దర్శకత్వంలో 'వకీల్​ సాబ్​' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తవ్వగానే క్రిష్​ డైరెక్షన్​లో రూపొందనున్న సినిమా షూటింగ్​లో పాల్గొనున్నారు. మరోవైపు దర్శకుడు హరీశ్​ శంకర్​తో మరో చిత్రానికీ కమిట్​ అయ్యారు పవన్​. లాక్​డౌన్​ కారణంగా చిత్రీకరణలు ఎక్కడికక్కడే ఆగిపోయిన క్రమంలో క్రిష్​ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్​తో సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి... 'ఐశ్వర్యా.. మీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.