'ఐ లవ్యు రాజా' అంటే టక్కున గుర్తొచ్చేది ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి. ఆయన నటుడు కన్నా ముందే రచయితగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 150కిపైగా సినిమాలకు రచయితగా పనిచేసి.. ఆ తర్వాతే నటనపై దృష్టి పెట్టారు. దర్శకత్వంతో పాటు, నిర్మాణంలోనూ చేయి వేసి తెలుగు చిత్రసీమలో ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు.
'శ్రావణమాసం', 'ఆపరేషన్ దుర్యోధన', 'ఆపద మొక్కులవాడు', 'మెంటల్ కృష్ణ', 'రాజావారి చేపల చెరువు', 'పోసాని జెంటిల్‌మేన్', 'దుశ్శాసన' చిత్రాల్ని తెరకెక్కించి దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. 'మెంటల్‌కృష్ణ' తెరకెక్కించినప్పట్నుంచి ఆయన్ని అభిమానులు అదే పేరుతో ముద్దుగా పిలుచుకుంటుంటారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పరుచూరి బ్రదర్స్ దగ్గర
1958లో గుంటూరు జిల్లా పెదకాకానిలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు పోసాని. బీకామ్ చదివిన ఆయన, ఆ తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎమ్.ఎ (తెలుగు) డిగ్రీ పొందారు. యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకుడిగా కూడా పనిచేశారు. పీజీ అయ్యాక ఆయన మార్గదర్శి చిట్‌ఫండ్‌లో ఏడాది పాటు పనిచేశారు. అనంతరం మళ్లీ గుంటూరు వెళ్లిపోయారు. తండ్రి మరణం తర్వాత చెన్నై వెళ్లిన పోసాని అక్కడ పరుచూరి సోదరుల దగ్గర సహాయకుడిగా చేరారు. వాళ్ల దగ్గర పనిచేస్తూనే ప్రెసిడెన్సీ కాలేజీలో ఎమ్.ఫిల్ చేశారు. ఆ తరువాత పీహెచ్‌డీ కోసం కూడా చేరినప్పటికీ, పనుల వల్ల మధ్యలోనే ఆపేశారు.
'గాయం'తో రచయితగా
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'గాయం'కు రచయితగా పనిచేశారు పోసాని కృష్ణమురళి. అదే ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత నాగార్జున కథానాయకుడిగా నటించిన 'రక్షణ'కు పనిచేశారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'అల్లుడా మజాకా'కు కథతో పాటు, సంభాషణలు, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చారు.
ఆ తర్వాత వెనుదిరిగి చూసుకొనే అవసరం పోసానికి రాలేదు. 'పవిత్రబంధం', 'తాళి', 'ప్రేమించుకుందాం రా', 'పెళ్ళి చేసుకుందాం', 'గోకులంలో సీత', 'శివయ్య', 'రవన్న', 'మాస్టర్', 'ఆహా', 'భద్రాచలం', 'ఎవడ్రా రౌడీ', 'జెమిని', 'రాఘవేంద్ర', 'పల్నాటి బ్రహ్మనాయుడు', 'సీతయ్య', 'భద్రాద్రిరాముడు' ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ఆ తరువాత దర్శకత్వం కూడా చేశారు. ఆయన తెరకెక్కించిన 'ఆపరేషన్ దుర్యోధన', 'మెంటల్‌కృష్ణ' చిత్రాలు మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'ధర్మక్షేత్రం'తో
'ధర్మక్షేత్రం'తో తొలిసారి కెమెరా ముందుకొచ్చిన పోసాని.. క్రమం తప్పకుండా నటిస్తూ వచ్చారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నటుడిగానే కొనసాగుతున్నారు. అగ్ర దర్శకులుగా కొనసాగుతున్న త్రివిక్రమ్, కొరటాల శివ తదితరులు పోసాని కృష్ణమురళి దగ్గర రచయితలుగా పనిచేసినవాళ్లే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : వెండితెరపై బిహార్ 'జ్యోతి' సైక్లింగ్ సాహసం