ETV Bharat / sitara

జ్ఞాపకాల తెరలపై స్వర రాజ తరంగాలు - music director Rajan special story

సంగీత దిగ్గజం రాజన్​ మృతి సినీప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పలు భాషల్లో ఆయన సినీసంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ప్రత్యేక కథనం మీకోసం..

Rajan
రాజన్
author img

By

Published : Oct 13, 2020, 9:32 AM IST

సంగీత సామ్రాజ్యాన్ని పాలించి.. లాలించి.. శాసించిన దిగ్గజం రాజన్‌ మరణం సోమవారం సినీప్రియులను వేదనకు గురిచేసింది. బెంగళూరులోనే ఆయన తన చివరిరోజులను గడిపినా.. దక్షిణభారత సినీసామ్రాజ్యాన్ని పాలించిన ఘనత మూటగట్టుకున్నారు. 'ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ. ఎన్నటికీ మాయని మమత నీదీ నాదీ' అంటూ పూజ సినిమాలో జన్మజన్మల బంధం, అనుబంధం గురించి వివరించినా, 'మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం'.. అంటూ విరహ గీతం పాడినా, 'నాగమల్లివో తీగమల్లివో' అంటూ ప్రేయసిని పొగడ్తలతో ముంచెత్తినా, 'ఏమో ఏమో ఇది నాకేమో అయినది.. ఈ వేళలో నా గుండెలో' అంటూ ప్రియుడితో యుగళగీతం పాడినా.. వాటికి స్వరాల్ని సమకూర్చిన రాజన్‌- నాగేంద్ర ద్వయానికే చెల్లింది. ఆ ఇద్దరిలో స్వరాగ్రజుడు రాజన్‌ కన్నుమూశారన్న వార్త కన్నడనాడును సోమవారం దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇటు తెలుగు, అటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళం, సింహళీయ భాషల్లో సినీ సంగీతానికి ఆ ఇద్దరూ చెరగని ముద్రవేశారు.

సినిమాకు రాజన్‌- నాగేంద్ర సంగీతం ఉండాల్సిందేనని అప్పట్లో అనేకమంది నిర్మాతలు పట్టుపట్టేవారట. వీరిద్దరి పాత్రలేకుంటే సినిమాలు విజయతీరం వైపు పయనించడం సాధ్యంకాదని వారి భావన. ఇక చందనసీమ విషయానికొస్తే కన్నడ కంఠీరవుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌, సాహస సింహ విష్ణువర్ధన్‌ల సినిమాల్లో వీరి పాటలు తప్పనిసరి అనే కాలం కొనసాగిందని చెబుతారు. 'నా నిన్న మరెయలారె.. ఎందెందూ నిన్నన్ను బిడలారె', 'సిహిముత్తు సిహిముత్తు ఇన్నొందు'.. ఇలాంటి పాటలు దశాబ్దాలు గడుస్తున్నా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఇప్పటికి కూడా ఏ కార్యక్రమం జరిగినా రాజన్‌-నాగేంద్ర సంగీతం సమకూర్చిన పాటలే వినవస్తుంటాయి. ఇందుకు రాజన్‌ ఒకానొక సందర్భంలో కారణం కూడా చెప్పారు. సంగీతమంటే ఆషామాషీ వ్యవహారం కాదని- నిరంతర శ్రమ ద్వారానే కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించవచ్చని వివరించారు. అందుకేనేమో.. ఏమాత్రం తీరిక దొరికినా ఆయన ఓ రుషిలా దీర్ఘాలోచనలో గడిపేవారని రాజన్‌ గురించి తెలిసినవారు గుర్తుచేసుకుంటారు.

సంగీత రంగంలో అసమాన ప్రతిభను కనపరచిన రాజన్‌- నాగేంద్ర ద్వయానికి గర్వం, అసూయ దరిదాపుల్లో కూడా కనిపించవు. అందుకే వీరిని అజాత శత్రువులని అంటారు. ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, పి.సుశీల, ఎస్‌.జానకి అమితంగా గౌరవించేవారట. ఇక నటుల గురించి చెప్పాలంటే కన్నడ కంఠీరవుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌ల పాటలకు సంగీతాన్ని సమకూర్చినవారిగా గుర్తింపు పొందారు. చి.ఉదయ శంకర్‌ సాహిత్యానికి అధికంగా సంగీతాన్ని సమకూర్చడం గమనార్హం. గంధదగుడి సినిమాలోని ‘నావాడువ నుడియే కన్నడ నుడి’.. పాట నేటికీ కన్నడిగుల హృదయాల్ని అమితంగా ఆకట్టుకోవడం రాజన్‌- నాగేంద్రల ప్రతిభకు నిదర్శనం. సంగీతం కొనసాగినంతకాలం వీరి సేవలు సంగీతాభిమానులను అట్టిపెట్టుకుని ఉంటాయి.

ఇదీ చూడండి మళ్లీ యాక్షన్​ చెప్పేందుకు 'దిగ్గజాలు' సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.