తెలుగు, తమిళ భాషల్లో ఎడిటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కోలా భాస్కర్ (55) కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన... హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8 గంటలకు తుదిశ్వాస విడిచారు.
పవన్ కల్యాణ్ 'ఖుషీ', '7జీ బృందావన్ కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాలకు భాస్కర్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు కోలా బాలకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ 'నన్ను వదలి నీవు పోలేవులే' పేరుతో తెలుగు, తమిళంలో ఓ సినిమా కూడా తీశారు.