ETV Bharat / sitara

'రాధేశ్యామ్​'లో పూజా హెగ్డే పాత్ర ఇదేనా! - ప్రభాస్​ పూజాహెగ్డే

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్​'. ఈ సినిమాలో పూజాహెగ్డే.. వైద్యురాలిగా నటించనుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Pooja Hegde plays a medico role in Radhe Shyam
'రాధేశ్యామ్​'లో మెడికోగా పూజాహెగ్డే!
author img

By

Published : Apr 17, 2021, 7:05 PM IST

ప్రభాస్‌-పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజాహెగ్డే 'ప్రేరణ' అనే పాత్రలో నటిస్తోంది. అయితే ఆమె ఇందులో మెడికోగా కనిపించనుందని వార్తలొస్తున్నాయి. కథలో ప్రభాస్‌ ఓ ప్రమాదంలో చిక్కుకుని ఆసుపత్రిలో చేరతారట. అక్కడే ప్రేరణ (పూజా) మెడికోగా పని చేస్తుంటుందట. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ ప్రయాణం మొదలవుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ విడుదలై చిత్రంపై అంచనాలను పెంచేశాయి.

యూవీ క్రియేషన్స్, టీ-సీరీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తుండగా, కృష్ణంరాజు, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్‌ కపూర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా జులై 30న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ప్రస్తుతం పూజ తెలుగులో అఖిల్‌తో కలిసి 'మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌', చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న 'ఆచార్య'లో నీలాంబరిగా నటిస్తోంది. హిందీలో 'సర్కస్‌', తమిళంలో విజయ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.

ఇదీ చూడండి: లింగుస్వామి చిత్రంలో పోలీస్​ ఆఫీసర్​గా రామ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.