మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. 2019 డిసెంబర్‌లోనే థాయ్‌లాండ్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి నుంచి సినిమా చిత్రీకరణ తిరిగి శరవేగంగా జరుపుకొంటోంది. దేశంలో మరోసారి కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తదుపరి షెడ్యూల్‌ను జూన్‌లో షూట్ చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
కాగా, జైపుర్, జోధ్‌పూర్, మధ్యప్రదేశ్‌కు చెందిన రాజభవనాలకు బదులుగా.. హైదరాబాద్‌లోని సెట్లలో షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. జులై లేదా ఆగస్టులో చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారని టాక్ వినిపిస్తుంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జయరామ్, శోభిత ధూళిపాళ్ల, శరత్ కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇదీ చూడండి.. చీరకట్టు అందాలతో 'వకీల్‌సాబ్' భామ