ETV Bharat / sitara

'భీమ్లానాయక్‌' ప్రీ రిలీజ్‌.. ఫ్యాన్స్​కు పోలీసులు కీలక సూచనలు - Bheemlanayak release date

Bheemlanayak Pre release event: రిలీజ్​కు సిద్ధమైన 'భీమ్లానాయక్'​ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్ గ్రౌండ్స్‌ వేదికగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడం, అనవసర గొడవలను, తొక్కిసలాటలను నివారించేందుకు పోలీసులు కొన్ని సూచనలు జారీ చేశారు. అవేంటంటే..

pawankalyan bheemlanayak
పవన్​కల్యాణ్​ భీమ్లానాయక్​
author img

By

Published : Feb 23, 2022, 7:59 AM IST

Bheemlanayak Pre release event: పవన్‌కల్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్​ చిత్రం 'భీమ్లా నాయక్‌' రిలీజ్​కు సిద్ధమైంది. దర్శకుడు సాగర్‌ కె.చంద్ర తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం 'భీమ్లానాయక్‌' ప్రీరిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్ గ్రౌండ్స్‌ వేదిక ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో పోలీసులు కొన్ని సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడం, అనవసర గొడవలను, తొక్కిసలాటలను నివారించేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

పోలీసుల సూచనలు

  • ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్దేశించిన పాసులు ఉన్నవారికి మాత్రమే లోనికి అనుమతి.
  • ఫిబ్రవరి 21న ఈవెంట్ కోసం ఇచ్చిన పాసులు చెల్లవు. కొత్త పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు.
  • వందల సంఖ్యలో వాహనాలు వస్తే సరైన పార్కింగ్ సౌకర్యం లభించడం కష్టం. వ్యక్తిగత వాహనాలలో కాకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా సభా స్థలానికి చేరుకుంటే మంచిది.
  • పాసులు లేనివారు గ్రౌండ్ వద్దకు వచ్చి గుమిగూడటానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు.
  • పాసులు లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడొద్దు. దయచేసి పాసులు లేని వారు రావొద్దు.
  • ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరిగే ప్రాంతానికి పాసులు లేకుండా వచ్చి గొడవ పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
  • మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి11 గంటల మధ్య యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోండి.
  • జూబ్లీహిల్స్ రోడ్ నెం.5 నుంచి యూసుఫ్‌గూడ వైపు వెళ్లే వాళ్ళు కమలాపురి కాలనీ రోడ్డును ఎంచుకోవాలి.
  • అమీర్ పేట్ నుంచి యూసుఫ్‌గూడ మీదుగా జూబ్లీహిల్స్ వెళ్లే వారు గణపతి కాంప్లెక్స్ మీదుగా కమలాపురి కాలనీ రోడ్డు, ఇందిరా నగర్ మీదుగా వెళ్తే మంచిది.
  • ప్రీ రిలేజ్ ఈవెంట్ కోసం వచ్చిన వారు తమ వాహనాలను నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే పార్క్ చేయాలి. రోడ్డు మీద పార్క్ చేస్తే సీజ్‌ చేయటంతో పాటు, తగిన చర్యలు తీసుకుంటాం.

ఇదీ చూడండి: టాలీవుడ్​ క్రేజీ కాంబోలు.. ఫుల్​ బిజీగా హీరోలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.