ETV Bharat / sitara

అక్షయ్​ సినిమా షూటింగ్​పై ఫిర్యాదు.. 20 వాహనాలు సీజ్​! - mumbai traffic police action on akshay film set

Akshay kumar film shooting case: బాలీవుడ్​ స్టార్​ అక్షయ్​కుమార్​ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్​పై పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. ఓ వ్యానిటీ వ్యాన్​ సహా 20 వాహనాలను సీజ్​ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

akshay kumar
అక్షయ్ కుమార్
author img

By

Published : Feb 24, 2022, 12:48 PM IST

Akshay kumar film shooting case: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్​పై ఫిర్యాదు నమోదైంది. పోలీసులు దీనిపై చర్యలు తీసుకున్నారు.

ఏం జరిగిందంటే?

ముంబయిలోని దానాపాణి ప్రాంతంలో అక్షయ్​ నటిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే గతరాత్రి.. షూటింగ్​కు సంబంధించిన ఓ వ్యానిటీ వ్యాన్ సహా 20 వాహనాలను అనుమతి లేని ప్రాంతంలో పార్కింగ్​ చేసింది చిత్రబృందం. ​ దీంతో పోలీసులు ఆ వాహనాలను సీజ్​ చేశారు. ఆ సమయంలో అక్షయ్​ అక్కడ లేరు. అప్పటికే షూటింగ్​ ముగించుకుని ఆయన వెళ్లిపోయారు.

అక్షయ్​.. త్వరలోనే 'బచ్చన్​ పాండే', 'పృథ్వీరాజ్​' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటే రక్షా బంధన్​, రామ్​సేతు, మిషన్​ సిండ్రిల్లా, ఓ మై గాడ్​ 2, గోర్ఝా, సెల్ఫీ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చదవండి: ముందుగానే సమ్మర్​ సునామీ.. గ్యాప్​ లేకుండా సినిమాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.