ETV Bharat / sitara

ఆ వార్తతో డిప్రెషన్​లోకి వెళ్లా: పాయల్ - payal rajput

కరోనా కారణంగా ఇష్టమైన వ్యక్తిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది నటి పాయల్​. ప్రస్తుతం తాను మానసిక కుంగుబాటుకు గురైనట్లు చెప్పింది.

payal
పాయల్​
author img

By

Published : May 19, 2021, 2:13 PM IST

Updated : May 19, 2021, 3:19 PM IST

ప్రస్తుతం తాను డిప్రెషన్​లో ఉన్నానని నటి పాయల్‌ రాజ్‌పుత్‌ చెప్పింది. కొవిడ్‌ కారణంగా ఇష్టమైన వ్యక్తుల్ని కోల్పోవడం, ఎంతో బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పాయల్‌ ఓ పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయని, అందరూ ఇంటికే పరిమితమై తమ వారిని రక్షించుకోవాలని సూచించింది.

"ఇదే నా జీవితంలో అతి క్లిష్టమైన దశ. ఎంతో ఆందోళనగా ఉంది. మానసిక కుంగుబాటుకు లోనయ్యా. గట్టిగా ఏడవాలని అనిపిస్తోంది. నాలోని బాధను చెప్పడానికి మాటలు కరవయ్యాయి. నాకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయా. ఈ కరోనా కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి దేవుడు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నా. దయచేసి అందరూ తమ కుటుంబసభ్యుల్ని సంరక్షించుకోవాలని సూచిస్తున్నా" అని పాయల్‌ పోస్ట్‌ పెట్టింది.

తనకెంతో ఆప్తురాలైన అనితా ఆంటీ కొవిడ్‌-19 కారణంగా కన్నుమూశారని పాయల్‌ తెలియజేసింది. ఆమె మరణవార్త తనను ఎంతగానో కలచి వేసిందని పేర్కొంది.

ఇదీ చూడండి: చిట్టి గౌనులో పాయల్.. బికినీలో తేజస్వి

Last Updated : May 19, 2021, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.