ETV Bharat / sitara

Pawan Kalyan: పవర్​స్టార్​కు ఇష్టమైన వంటకాలివే! - హరిహర వీరమల్లు

హీరోహీరోయిన్లు అందం కోసం ఫిట్​నెస్​ కోసం డైటింగ్​ చేస్తుంటారు. కానీ, పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​(Pawan Kalyan)కు మాత్రం అలాంటి డైటింగ్ ప్లాన్స్​ ఏమి ఉండవంటే నమ్ముతారా? ​మీరు విన్నది నిజమేనండి.. పవన్​ కల్యాణ్​ ఎలాంటి డైటింగ్​ ఫాలో కాకుండా తనకు ఇష్టమైన ఫుడ్​ను లాగించేస్తారట.

Pawan Kalyan's favorite dishes
Pawan Kalyan: పవర్​స్టార్​కు ఇష్టమైన వంటకాలివే!
author img

By

Published : Jun 1, 2021, 8:02 PM IST

సినిమా స్టార్లంటే తమకు ఇష్టమైన ఆహారం ఎదురుగా ఉన్నా.. వాటిని తినకుండా నోరు కట్టేసుంటారు. కానీ, కొంతమంది తారలు మాత్రం డైటింగ్​ పక్కనపెట్టి.. తమకు ఇష్టమైన ఆహారాన్ని లాగించేస్తుంటారు. అయితే పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​(Pawan Kalyan) ఇదే కోవకు చెందినవారని టాలీవుడ్​లో టాక్​ వినిపిస్తుంది.

పవన్​కు ఎంతో ఇష్టమైన వంటకాల్లో నెల్లూరు చేపల పులుసు ఒకటి. కానీ, నాటుకోడి కూర అంటే ఆయనకు అమితమైన ఇష్టమట. వీటితో పాటు పులిహోర కూడా ఇష్టంగా తింటారట. అయితే పవన్​ ఒకే విధమైన డైట్​ అంటూ ఏమి అనుసరించరని చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కచ్చితమైన డైట్​ అంటూ ఏమి లేకుండా తన ఇంట్లో ఏమి వండితే పవన్​ అవే తింటారని తెలుస్తోంది.

ఇటీవలే కరోనా బారిన పడిన పవన్​ కల్యాణ్​ కోలుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన నటించిన 'వకీల్​సాబ్​'(vakeel saab) ఇటీవలే విడుదలై హిట్​ టాక్​ తెచ్చుకుంది. పవన్​ ప్రస్తుతం క్రిష్​ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు'(harihara veeramallu), 'అయ్యప్పనుమ్​ కోశియుమ్​' రీమేక్(ayyappanum koshiyum remake)​లో నటిస్తున్నారు. ఈ సినిమాల తర్వాత హరీశ్​ శంకర్​, సురేందర్​రెడ్డి దర్శకులతో సినిమా చేయనున్నారు. ​

ఇదీ చూడండి: Akira Nandan: పవన్​ తనయుడి పిక్​ వైరల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.