పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. యువ దర్శకుడు సాగర్ చంద్రతో ఓ చిత్రం చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కి రీమేక్ ఇది. రానా మరో హీరోగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా, త్రివిక్రమ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత రాధాకృష్ణ స్క్రిప్ట్ అందజేశారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ చిత్రంలో పవన్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఒరిజనల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో రానా నటించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.


