వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ మరోసారి దిల్‌రాజు నిర్మాణంలో సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వైవిధ్యమైన చిత్రాలను తీయడంలో దిల్‌రాజు ముందుంటారు. తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఆయనకు ఓ కథను వినిపించారట. ఆ కథ బాగా నచ్చడం వల్ల దిల్‌రాజు కూడా ఓకే చెప్పారట.
పవన్ కరోనా నుంచి కోలుకోగానే వంశీ ఈ కథను వినిపించనున్నారట. పవన్ ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తున్నారు. మలయాళ చిత్రం 'అయప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌లోనూ నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తారు. ఈ చిత్రాలు పూర్తికాగానే దిల్‌రాజు- వంశీ- పవన్‌ల చిత్రం లైన్‌లోకి వచ్చే అవకాశం ఉంటుందేమో చూడాలి మరి.