ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' అనౌన్స్​మెంట్.. పవన్​, మహేశ్​ ఒకేసారి - mahesh babu sarkaru vaari paata

పవన్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్, మహేశ్ 'సర్కారు వారి పాట' చిత్రీకరణలు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అలానే 'ఆర్ఆర్ఆర్' నుంచి ఓ ప్రకటన మధ్యాహ్నం 2 గంటలకు రానుంది.

Pawan Kalyan  mahesh babu
పవన్ మహేశ్
author img

By

Published : Jan 25, 2021, 11:08 AM IST

Updated : Jan 25, 2021, 11:31 AM IST

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్, సూపర్​స్టార్ మహేశ్​బాబు.. ఒకేసారి కెమెరా ముందుకు అడుగుపెట్టారు. వాళ్ల కొత్త సినిమాల షూటింగ్​లు సోమవారం వేర్వేరుగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని చిత్రయూనిట్​లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాయి.

'సర్కారు వారి పాట' షురూ

బ్యాంక్​ల ఎగవేత నేపథ్య కథతో తీస్తున్న 'సర్కారు వారి పాట' షూటింగ్​ దుబాయ్​లో మొదలైంది. ఇటీవల మహేశ్​బాబు కుటుంబంతో సహా అక్కడికి చేరుకున్నారు. హీరోయిన్​ కీర్తి సురేశ్​ కూడా దుబాయ్​ వెళ్తున్న ఫొటోను ఈ మధ్యే ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా, పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

రానాతో పవన్.. రచ్చ మొదలు

'అయ్యప్పునుమ్ కోషియమ్' రీమేక్​ షూటింగ్​ కూడా సోమవారమే ప్రారంభమైంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇందులో పవన్​తో పాటు రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్, స్క్రీన్​ప్లేతో పాటు మాటల్ని అందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ నిర్మిస్తోంది.

Pawan Kalyan Ayyappanum Koshiyum remake
'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ ప్రారంభోత్సవంలో పవన్​ కల్యాణ్ (పాత ఫొటో)

'ఆర్ఆర్ఆర్' నుంచి అనౌన్స్​మెంట్

'ఆర్ఆర్ఆర్' నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అనౌన్స్​మెంట్ రానుంది. విడుదల తేదీనే చెబుతారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఏం ప్రకటన వస్తుందో చూడాలి.

RRR ANNOUNCMENT
ఆర్ఆర్ఆర్ నుంచి అప్​డేట్

Last Updated : Jan 25, 2021, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.