ETV Bharat / sitara

బ్రిటన్​ బాక్సాఫీస్​ వద్ద 'పారాసైట్​' కాసుల వర్షం - parasite movie collections

ఈ ఏడాది ఆస్కార్‌ చిత్రోత్సవంలో చరిత్ర సృష్టించిన దక్షిణకొరియా సినిమా 'పారాసైట్​'.. ఉత్తమ చిత్రంతో పాటు ఎన్నో విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్ల రూపంలో మరో మైలురాయిని చేరుకుంది.

Parasite becomes UK's highest-grossing foreign-language film
బ్రిటన్​ బాక్సాఫీస్​పై 'పారాసైట్​' దండయాత్ర
author img

By

Published : Mar 11, 2020, 5:38 AM IST

ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు అందుకున్న 'పారాసైట్'​.. ప్రస్తుతం బ్రిటీష్​ బాక్సాఫీస్​ వద్ద కాసులవర్షాన్ని కురిపిస్తోంది. యూకేలో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ భాషా చిత్రంగా ఘనత సాధించింది.

'బాంగ్ జూన్ హో' దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కొరియన్​ చిత్రం.. 2019 మే 31న ఆ దేశంలో విడుదలైంది. విశేషాదరణ పొందిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా రిలీజ్​ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఫిబ్రవరి 7న బ్రిటన్​ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పట్నుంచి ఇప్పటివరకు దాదాపు వంద కోట్లకు పైచిలుకు కలెక్షన్లు సాధించింది. ఫలితంగా వసూళ్లలో సరికొత్త రికార్డులను సృష్టించిందని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ట్విట్టర్​లో వెల్లడించారు.

'పారాసైట్​' సినిమాకు ఆస్కార్​ చిత్రోత్సవంలో అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితో సహా నాలుగు పురస్కారాలు అందుకుంది. ఈ అవార్డు అందుకున్న రెండో విదేశీ దర్శకుడిగా ఘనత సాధించాడు 'బాంగ్ జూన్ హో'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 19 వందల కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టింది.

కథేంటంటే...

ఓ పేద కుటుంబంలోని నలుగురు వ్యక్తులు.. కడుపు నింపుకోవడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో.. ఉద్యోగాల కోసం ఓ ధనిక కుటుంబం పంచన చేరుతారు. తామంతా ఒకే కుటుంబం అన్న విషయాన్ని యజమానుల దగ్గర దాచిపెడతారు. వాళ్ల కన్నా ముందు ఆ ఉద్యోగాలు చేస్తున్న వారిని మోసపూరితంగా ఆ ఇంటి నుంచి వెళ్లగొడతారు. యజమాని కుటుంబం విహార యాత్రకు వెళ్లినప్పుడు ఆ ఇంటిలోని సౌకర్యాలను అనుభవిస్తూ దర్జాగా గడిపేస్తుంటారు. అయితే తమ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి వీరంతా ఒకే కుటుంబం అన్న విషయం తెలిసిపోతుంది.

ఆలోపు యజమాని కుటుంబం తిరిగి వచ్చేస్తోందన్న సమాచారం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తమ బండారం బయటపడితే ఉద్యోగాలు పోతాయన్న భయంతో వాళ్లేం చేశారు? అనే విషయాలతో పారాసైట్​ చిత్రం తెరకెక్కింది. పేద, ధనిక వర్గాల అంతరాల వల్ల సమాజంలో నెలకొన్న కఠిన పరిస్థితులకు.. వినోదాన్ని జోడించి దర్శకుడు అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని టెలివిజన్​ సిరీస్​ రూపంలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి.. మణిరత్నం మ్యాజిక్​: 25 వసంతాల బొంబాయి లవ్​స్టోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.