ETV Bharat / sitara

త్రిషకు నిర్మాత వార్నింగ్.. ప్రమోషన్స్​లో పాల్గొనపోతే అంతే - కోలీవుడ్ నిర్మాత టి. శివ

నటి త్రిషకు కోలీవుడ్ నిర్మాత టి. శివ షాకిచ్చాడు. ఇకపై ఆమె నటించిన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పాడు. అలా చేయకపోతే రెమ్యునరేషన్​లో కోత విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపాడు.

త్రిష
త్రిష
author img

By

Published : Feb 23, 2020, 1:12 PM IST

Updated : Mar 2, 2020, 7:12 AM IST

ప్రమోషన్‌ కార్యక్రమాల్లో నటి త్రిష పాల్గొనకపోతే ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్‌లో కొంత భాగం నిర్మాతకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని నిర్మాత టి.శివ హెచ్చరించారు. 24 హౌస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్​పై తిరుజ్ఞానం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పరమపద విళైయాట్టు'. ఇందులో త్రిష ప్రధాన పాత్ర పోషించింది. ఆమెకు ఇది 60వ చిత్రం కావడం విశేషం. అమ్రీష్‌ సంగీతం సమకూర్చాడు. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుంది.

తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం చెన్నైలోని సత్యం థియేటర్‌లో జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి నటి త్రిష హాజరు కాలేదు. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్వయాన ఆమే పాల్గొనకపోవడం వల్ల చిత్రబృందం ఆవేదనకు గురైంది.

ఈ నేపథ్యంలో నిర్మాత శివ మాట్లాడుతూ "ఈ సినిమాను నేనింకా చూడలేదు. కానీ చిత్రాన్ని చూసిన నా మిత్రులు చాలా బాగుందని చెప్పారు. హీరో లేకుండా అద్భుతంగా రూపొందించారు. త్రిష స్టార్‌ హోదాతో సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ చిత్ర కార్యక్రమానికి ఆమె రాకపోవడం బాధాకరం. భవిష్యత్తులో ఆమె ఇలాంటి ప్రచార కార్యక్రమాలకు సహకరించకపోతే ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్‌లో కొంత భాగం నిర్మాతకు తిరిగి ఇచ్చేలా నిర్మాతల మండలి తరఫున కోరుతాం" అని చెప్పాడు.

Last Updated : Mar 2, 2020, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.