ETV Bharat / sitara

'నటనకు వీడ్కోలు చెప్పిన తర్వాత వ్యవసాయం చేస్తా'

సినీ కెరీర్​కు గుడ్​బై చెప్పాక వ్యవసాయం చేసుకుంటానని వెల్లడించాడు బాలీవుడ్​ నటుడు పంకజ్​ త్రిపాఠి. ఇటీవలె 'గుంజన్​ సక్సేనా' సినిమాలో కీలకపాత్రలో కనువిందు చేశాడు.

Pankaj Tripathi spills beans on his retirement plan
'నటనకు వీడ్కోలు చెప్పిన తర్వాత వ్యవసాయం చేస్తా'
author img

By

Published : Aug 18, 2020, 2:19 PM IST

సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వ్యవసాయం చేయాలనుకుంటున్నట్లు బాలీవుడ్​ నటుడు పంకజ్​ త్రిపాఠి వెల్లడించాడు. అప్పటి వరకు నటుడిగా తన ప్రేమను, ఆనందాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

"నాతోపాటు ఇతరుల జీవితాల్లో ప్రేమను తీసుకురావాలన్నది నా కల. సినిమాలకు వీడ్కోలు పలికిన తర్వాత వ్యవసాయం చేయాలని అనుకుంటున్నా".

- పంకజ్​ త్రిపాఠి, బాలీవుడ్​ నటుడు

ఇటీవలె ఓటీటీలో విడుదలైన 'గుంజన్​ సక్సేనా' బయోపిక్​లో సహాయనటుడి పాత్ర పోషించాడు పంకజ్​. ఈ సినిమాలో తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

1999లో జరిగిన కార్గిల్​ యుద్ధంలో భాగమైన తొలి భారత వైమానిక దళ మహిళా పైలట్​ కావడానికి గుంజన్​ పడిన తపనను.. వెండితెరపై కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు శరణ్​ శర్మ. టైటిల్​ రోల్​లో జాన్వీ కపూర్​ నటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.