ETV Bharat / sitara

'పక్కా కమర్షియల్' రిలీజ్ డేట్.. 'పుష్పక విమానం'కు పూరీ విషెస్ - తెలుగు మూవీ న్యూస్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పక్కా కమర్షియల్, పుష్పక విమానం, 11:11, ప్రతీక్ గాంధీ-విద్యాబాలన్ కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Nov 11, 2021, 10:36 PM IST

*గోపీచంద్ 'పక్కా కమర్షియల్' రిలీజ్ డేట్ ఫిక్సయింది. వచ్చే మార్చి 18న థియేటర్లలోకి రానుందని పోస్టర్​ను విడుదల చేశారు. గోపీచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్​గా నటించింది. జేక్స్ బెజోయ్ సంగీతమందించగా, మారుతి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, జీఏ 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

pakka commercial release date
గోపీచంద్ పక్కా కమర్షియల్ మూవీ

*సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు '11:11' టైటిల్​ను నిర్ణయించారు. మెగాస్టార్ చిరంజీవి.. గురువారం ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేశారు. ఇందులో వర్ష విశ్వనాథ్ హీరోయిన్​గా నటిస్తోంది. కిట్టు నల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు.

.
.

*'స్కామ్ 1992' ఫేమ్ ప్రతీక్​ గాంధీ.. విద్యాబాలన్​తో నటిస్తున్నారు. ఈ సినిమా ఇలియానా, సెంథిల్ రామమూర్తి కీలకపాత్రలు పోషిస్తున్నారు. మోడ్రన్ రిలేషన్​షిప్​ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాడ్ ఫిల్మ్ మేకర్ శిరీష్ గుహ.. ఈ ప్రాజెక్టుకు డైరెక్షన్​ చేస్తున్నారు.

prathik gandhi vidya balan illiana
ప్రతీక్ గాంధీ-విద్యాబాలన్-ఇలియానా

*'పుష్పక విమానం' సినిమాకు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఆల్​ ది బెస్ట్ చెప్పారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. భార్య కనిపించకుండా పోతే.. ఓ సాధారణ భర్త ఏం చేశాడనే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శుక్రవారం(నవంబరు 12) థియేటర్లలోకి రానుందీ చిత్రం. ఆనంద్ దేవరకొండ, శాన్వీ మేఘన, గీత్ సైనీ హీరోహీరోయిన్లుగా నటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.