పాకిస్థాన్లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానం జనావాసాల మధ్య కూలిపోవడం వల్ల విమానంలో ఉన్న 99 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాక్ అధికారులు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో పాకిస్థాన్ నటి అయేజా ఖాన్ మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు చక్కర్లు కొట్టాయి.
అంతేకాదు, ఆమె భర్త కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని అయేజా ఖండించారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. దయచేసి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వార్తలను ప్రచారం చేసేవారిని ఆ దేవుడు తప్పక శిక్షిస్తాడని అన్నారు.
ఇదీ చూడండి... 'ఆర్ఆర్ఆర్' స్క్రిప్టులో కీలక మార్పులు!