ETV Bharat / sitara

'నా సినిమాలు రీమేక్​ అవ్వడం ఆనందంగా ఉంది' - Ayushmann's Article 15

దక్షిణాదిలో తను నటించిన చిత్రాలు రీమేక్​ అవ్వడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు నటుడు ఆయుష్మాన్​ ఖురానా. అనేక భాష, సంస్కృతి, సరిహద్దులను అధిగమించే శక్తి సినిమాలకే ఉందని అభిప్రాయపడ్డాడు. తన కెరీర్​లో​ అలాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన రచయితలు, దర్శకులు, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు.

Overwhelming to know my films are being remade in South: Ayushmann
'నా సినిమాలు రీమేక్​ అవ్వడం ఆనందంగా ఉంది'
author img

By

Published : May 25, 2020, 4:36 PM IST

బాలీవుడ్​ విలక్షణ నటుడు ఆయుష్మాన్​ ఖురానా.. తన చిత్రాలు దక్షిణాది సినీపరిశ్రమల్లో రీమేక్​ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. భాష, సంస్కృతి, సరిహద్దులను అధిగమించే శక్తి సినిమాలకు ఉందని అభిప్రాయపడ్డాడీ హీరో.

ఆయుష్మాన్ హీరోగా నటించిన ఐదు చిత్రాలు దక్షిణాదిన తిరిగి రూపొందుతున్నాయి. 'అంధాధున్'​ రీమేక్​ను తెలుగు, తమిళ భాషల్లో.. 'డ్రీమ్​ గర్ల్'​ను తెలుగులో.. 'విక్కీ డోనర్'​ను తమిళంలో తెరకెక్కిస్తున్నారు. వీటితో పాటు ఆయుష్మాన్​ 'ఆర్టికల్​ 15'ను తమిళంలో.. 'బధాయి హో'ను తెలుగులో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

"నా సినిమాల్లో కొన్ని రీమేక్​ అవ్వడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి సినిమాలకు నిజమైన పరీక్ష ఎదురుతోందని భావిస్తున్నా. భాష, సంస్కృతి, సరిహద్దులను దాటే శక్తి సినిమాలకు ఉందని నమ్ముతా. ప్రేక్షకులను అలరించడానికి నేను విభిన్న కథలను ఎంచుకుంటాను అనే దానికి ఇదే నిదర్శనం".

- ఆయుష్మాన్​ ఖురానా, బాలీవుడ్​ నటుడు

తన కెరీర్​లో ఇంతటి సూపర్​హిట్​ చిత్రాలను అందించిన దర్శకులు, నిర్మాతలు, రచయితలకు.. తనతో పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు ఆయుష్మాన్​.

ఇదీ చూడండి... బల్బీర్ ఆట చిరస్మరణీయం.. వ్యక్తిత్వం అనుసరణీయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.