OTT Release Movies: దర్శకుడు బోయపాటి, హీరో బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన 'అఖండ' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సుకుమార్, బన్నీ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప' చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు రాబడుతోంది. నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ దర్శతక్వం వహించిన 'శ్యామ్ సింగ్ రాయ్' చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అయితే.. ఈ చిత్రాలతో పాటు ఇటీవలే విడుదలైన పలు సినిమాలు ఓటీటీలో ఎప్పుడు విడుదల కానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
నాగశౌర్య రెండు సినిమాలు..
Naga Shaurya Movie OTT: యువ హీరో నాగశౌర్య నటించిన రెండు చిత్రాలు జనవరి 7న ఓటీటీ వేదికగా విడుదల కానున్నాయి. 'వరుడు కావలెను' చిత్రం జీ5 వేదికగా విడుదల కానుండగా, 'లక్ష్య' సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
-
గమనమా, గమ్యమా? ఏది ముఖ్యం? Watch sports action drama #Lakshya Jan 7 on aha.@IamNagashaurya #KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/3xCb5pFrax
— ahavideoIN (@ahavideoIN) December 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">గమనమా, గమ్యమా? ఏది ముఖ్యం? Watch sports action drama #Lakshya Jan 7 on aha.@IamNagashaurya #KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/3xCb5pFrax
— ahavideoIN (@ahavideoIN) December 27, 2021గమనమా, గమ్యమా? ఏది ముఖ్యం? Watch sports action drama #Lakshya Jan 7 on aha.@IamNagashaurya #KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/3xCb5pFrax
— ahavideoIN (@ahavideoIN) December 27, 2021
నెట్ఫ్లిక్స్లో నాని సినిమా..
నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతిశెట్టి, సాయిపల్లవి కథానాయికలు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలకానుందని తెలుస్తోంది.
హాట్ స్టార్లో 'అఖండ'..
Akhanda OTT Release: బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ' భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. జనవరి మొదటి వారం లేదా సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
అమెజాన్లో పుష్ప
Pushpa OTT: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలో రిలీజ్ కానుంది. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
సోనీలో స్కైలాబ్..
సత్యదేవ్, నిత్యా మేనన్ జంటగా నటించిన 'స్కైలాబ్' చిత్రం సోనీ లివ్ వేదికగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:
సర్ప్రైజ్లతో 'భీమ్లానాయక్', 'లైగర్' సిద్ధం