ETV Bharat / sitara

OTT Movies: ఈ వారం విడుదలయ్యే సినిమాలివే - హంగామా 2 ఓటీటీ

అభిమానుల ఆనందాన్ని పెంచేందుకు మరికొన్ని సినిమాలు ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో నారప్ప, ఇక్కత్, సార్పట్ట చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్​లు కూడా ఉన్నాయి. వాటి గురించే ఈ కథనం.

OTT Movies This Week
ఓటీటీ మూవీస్
author img

By

Published : Jul 18, 2021, 12:33 PM IST

సినీ అభిమానుల్ని అలరించేందుకు ఓటీటీలో ఈ వారం కూడా కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. అందులో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు పలు సిరీస్​లు ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఎందుకు OTTలో స్ట్రీమింగ్ కానున్నాయి?

నారప్ప- తెలుగు

విక్టరీ వెంకటేశ్ 'నారప్ప'.. జులై 20న అమెజాన్ ప్రైమ్​లో రిలీజ్ కానుంది. తమిళ సూపర్​హిట్​ 'అసురన్' రీమేక్​గా దీనిని తెరకెక్కించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్​ ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సార్పట్ట- తమిళం

బాక్సింగ్ కథతో తెరకెక్కిన చిత్రం 'సార్పట్ట'. ఆర్య హీరోగా నటించారు. ఈనెల 22న అమెజాన్ ప్రైమ్​లో తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. పా.రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

.
.

ఇక్కత్- కన్నడ

విడాకులు తీసుకోవాలనుకున్న ఓ జంట.. కరోనా లాక్​డౌన్​ కారణంగా ఒకే ఇంట్లో రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనే కథే 'ఇక్కత్'. కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. అమెజాన్ ప్రైమ్​లో 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

14 ఫెరే - హిందీ

పెళ్లికి సిద్ధమైన ఓ ప్రేమజంట.. ఇంట్లో వాళ్లను నొప్పించకుండా ఒక్కటి కావాలనుకుంటారు. ఈ క్రమంలో అద్దెకు తెచ్చిన తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకుంటారు? ఆ తర్వాత ఏం జరిగింది అనే కథతో తీసిన సినిమా '14 ఫెరే'. విక్రాంత్ మస్సే, కృతి కర్బందా హీరోహీరోయిన్లు. జులై 23న జీ5లో చిత్రం విడుదల కానుంది.

.
.

హంగామా 2 - హిందీ

శిల్పాశెట్టి దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం 'హంగామా 2'. రెండు కుటుంబాల మధ్య జరిగే హాస్యభరిత సంఘటనల కథే ఈ సినిమా. 1994లో మలయాళంలో వచ్చిన 'మిన్నారం' రీమేక్​గా దీనిని తెరకెక్కించారు. జులై 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

వీటితో పాటు 'ద లాస్ట్ లెటర్ ఫ్రమ్ యువర్ లవర్' సినిమా(జులై 23- నెట్​ఫ్లిక్స్), ఫీల్స్ లైక్ ఇష్క్(జులై 23- నెట్​ఫ్లిక్స్), స్కై రోజో సీజన్ 2(జులై 23- నెట్​ఫ్లిక్స్), టెడ్ లాసో సీజన్ 2(జులై 23- యాపిల్ టీవీ ప్లస్), మర్డర్ ఇన్ హిల్స్(బెంగాలీ సిరీస్ జులై 23- హోయ్​చోయ్), హాస్టల్ డేస్ సీజన్ 2(జులై 23- అమెజాన్ ప్రైమ్), కింగ్​డమ్: అసిన్ ఆఫ్ నార్త్(జులై 24- నెట్​ఫ్లిక్స్) సిరీస్​లు కూడా నెటిజన్లకు ముందుకు రానున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.