తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా చోట్ల కరోనా కారణంగా ఇంకా థియేటర్లు తెరుచుకోని పరిస్థితి. దీంతో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీ బాటపడుతున్నాయి. ప్రతి వారం వరుస చిత్రాలతో ఓటీటీ వేదికలు కళకళలాడుతున్నాయి. మరి ఈ వారం ఏయే సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయో చూద్దామా!
మాలిక్(మలయాళం)
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తాను నటించిన చిత్రాలను వరుసగా ఓటీటీలో విడుదల చేస్తూ, ప్రేక్షకులకు మరింత దగ్గరైన విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్. ఆయన కీలక పాత్రలో మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మాలిక్'. రూ.30కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని థియేటర్‌లలోనే విడుదల చేయాలని భావించినా కుదరలేదు. దీంతో అమెజాన్ ప్రైమ్ వేదికగా జులై 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. నటుడిగా ఫహద్ చేసే మాయాజాలం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
తుఫాన్(హిందీ)
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలో రాకేశ్ ఓం ప్రకాశ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా 'తుఫాన్'. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ఎంతగానో ప్రయత్నించింది. కానీ, సెకండ్‌వేవ్ వారి ఆశలను అడియాసలు చేసింది. దీంతో మరో ఆలోచన లేకుండా ఓటీటీకి వచ్చేశారు. జులై 16న అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'తుఫాన్' స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఫర్హాన్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఎప్పుడో 'బాగ్ మిల్కా బాగ్' లాంటి స్పోర్ట్స్ డ్రామాలో అలరించిన ఫర్హాన్ మరోసారి అదే జానర్‌లో సినిమా చేస్తున్నందున ఆసక్తి నెలకొంది.
కుడి ఎడమైతే (తెలుగు)
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కుడి ఎడమైతే'. క్రైమ్, సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి పవన్‌కుమార్ దర్శకత్వం వహించారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’ వేదికగా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'యూ టర్న్', 'లూసియా' వంటి సస్పెన్స్ థ్రిల్లర్లను ప్రేక్షకులకు అందించి ఇప్పటికే దర్శకుడిగా పవన్‌కుమార్ మంచి మార్కులు కొట్టేశారు. మరి 'కుడి ఎడమైతే' కథేంటో తెలియాలంటే ఈ నెల 16 వరకూ వేచి చూడాల్సిందే!
వీటితో పాటు ఇంకొన్ని చిత్రాలు/వెబ్ సిరీస్‌లు ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి, అలరించాయి.. అలరించబోతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్
- యానిమల్ కింగ్ డమ్: జులై 12, 2021
- నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఎస్2: జులై 15, 2021
- గన్‌పౌడర్ మిల్క్‌షేక్: జులై 14, 2021
- ఫియర్ స్ట్రీట్3: జులై 16, 2021
డిస్నీ+ హాట్‌స్టార్
- ది వైట్ లోటస్: జులై 13, 2021
- క్యాచ్ అండ్ కిల్-ది పాడ్ క్యాస్ట్ టేప్స్: జులై 13, 2021
సోనీ లైవ్
- వాజా: జులై 16, 2021
హెచ్‌బీవో మ్యాక్స్
- స్పేస్ జామ్-ఏ న్యూ లెగసీ: జులై 16, 2021
ఇదీ చదవండి: నవ్విస్తోన్న'మిమీ' ట్రైలర్.. మీరూ ఓ లుక్కేయండి