ప్రపంచ పట్టిపీడిస్తోన్న మహమ్మారి కరోనాపై హాలీవుడ్లో ఓ సినిమాను రూపొందించనున్నారు ఆస్కార్ అవార్డు గ్రహీత, అమెరికన్ కథారచయిత చార్లెస్ రాండోల్ఫ్. ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాతగాను ఈయనే కావడం మరో విశేషం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలోని వుహాన్ సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నట్లు రాండోల్ఫ్ తెలిపారు. ఎస్కే గ్లోబల్ నిర్మాణ సంస్థ.. ఈ చిత్రనిర్మాణంలో భాగం కానుంది.
ఇప్పటికే టాలీవుడ్లోనూ కరోనా నేపథ్యంలో మూడు సినిమాలు తీస్తున్నారు. వీటిని దర్శకత్వం వహిస్తున్న వారిలో రామ్గోపాల్ వర్మ, ప్రశాంత్ వర్మ, దేవ్ పిన్నమరాజు ఉన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చూడండి : నాకు కరోనా వచ్చినట్లుంది: ఇంగ్లాండ్ బౌలర్