ఆస్కార్ గెలవాలనేది సినీ పరిశ్రమలో ఉండే ప్రతిఒక్కరి చిరకాల కల. అంతటి ప్రతిష్టాత్మక పురస్కారం గెల్చుకున్నప్పుడు వేదికపైన భావోద్వేగంతో ప్రసంగిస్తుంటారు. అలాంటిది ఆస్కార్ చరిత్రలో అతి తక్కువసేపు మాట్లాడింది ఎవరిదో తెలుసా? 1962లో అకాడమీ అందుకున్న ప్యాటీ డ్యూక్ ది. అవార్డు అందుకొని థ్యాంక్యూ అని చెప్పేసి వేదిక దిగిపోయింది.
'ద మిరాకిల్ వర్కర్'(1962) అనే హాలీవుడ్ చిత్రానికి ఉత్తమ సహాయ నటి కేటగిరీలో అకాడమీ అందుకుంది ప్యాటీ. అతి తక్కువ వయసులో (16)ఆస్కార్ గెల్చుకున్న నటిగా రికార్డు సృష్టించింది. వేదిక మీదకు వచ్చి అవార్డు తీసుకుని ప్రసంగించిన ప్యాటీ ఈ మొత్తం తతంగాన్ని కేవలం 30 సెకండ్లలోనే పూర్తిచేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">