ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. లాస్ ఏంజిలెస్లోని డాల్ఫీ థియేటర్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. బెస్ట్ యానిమేటెడ్ సినిమా విభాగంలో 'టాయ్ స్టోరీ 4' ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది. ఈ చిత్రంతో పాటు 'హౌటూ యువర్ డ్రాగర్: ద హిడెన్ వరల్డ్', 'ఐ లాస్ట్ మై బాడీ', 'క్లౌస్', 'మిస్సింగ్ లింక్' సినిమాలూ నామినేషన్ల బరిలోకి దిగాయి.
షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆ సినిమాకే
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 'హెయిల్ లవ్' అవార్డును సొంతం చేసుకుంది. ఇందులో 'డిసెరా( డాటర్)', 'కిట్బుల్', 'మెమొరబుల్', 'సిస్టర్' చిత్రాలు బరిలో దిగినప్పటికీ.. పురస్కారాన్ని దక్కించుకోలేకపోయాయి.