ETV Bharat / sitara

ఆస్కార్​ రేసులో ఐదు చిత్రాలు.. ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా నిలిచేదేది?

Oscar Awards 2022: ఆస్కార్​ అవార్డుల కోసం యావత్​ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోంది. మార్చి వాటిని 27న ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో గట్టి పోటీ నెలకొంది. ఈ విభాగంలో భారతీయ చిత్రం 'జైభీమ్​' పోటీకి వెళ్లినా.. నామినేషన్​ దక్కించుకోలేదు. అయితే ఉత్తమ ఫీచర్​ ఫిల్మ్​ అవార్డును దక్కించుకోవడానికి బరిలో ఉన్న చిత్రాలపై ఓ లుక్కేయండి.

author img

By

Published : Mar 25, 2022, 10:29 AM IST

Osacr Awards 2022
international feature film news

Oscar Awards 2022: ఆస్కార్‌ పండగకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సినీప్రియుల్లో ఉత్సుకత అంతకంతకూ పెరుగుతోంది. ఈ 94వ ఆస్కార్‌ వేడుకల్లో ఉత్తమ నటుడిగా సత్తా చాటేదెవరు? ఉత్తమ నటిగా కాంతులీనే సొగసరి ఎవరు? ఆస్కార్‌ ప్రతిమను ముద్దాడబోయే చిత్రమేది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రశ్నలన్నింటికీ ఈనెల 27నే సమాధానం దొరకనుంది. ఎందుకంటే ఆరోజే పురస్కారాల ప్రదానోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం లాస్‌ ఏంజెల్స్​లోని డాల్బీ థియేటర్‌ చకచకా ముస్తాబవుతోంది.

Osacr Awards 2022
'డ్రైవ్‌ మై కార్‌'

ఈసారి ఆస్కార్‌ రేసులో ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో మొత్తం ఐదు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ విభాగంలోనే తొలుత భారతదేశం నుంచి సూర్య నటించిన తమిళ చిత్రం 'జైభీమ్‌' పోటీకి వెళ్లింది. కానీ తుది జాబితాలో నిలువలేకపోయింది. వీటిలో 'డ్రైవ్‌ మై కార్‌' ఉత్తమ చిత్రంగానూ ఆస్కార్‌ నామినేషన్‌ను దక్కించుకుంది. మరి ఈ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో పోటీ పడుతున్న ఆ మిగిలిన నాలుగు చిత్రాలేవి? వాటి విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి.

'ఫ్లీ' (దేశం: డెన్మార్క్‌)

Osacr Awards 2022
'ఫ్లీ'

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌.. ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌.. ఇలా ఆస్కార్‌ చరిత్రలో ఒకేసారి మూడు విభాగాల్లోనూ నామినేషన్లు దక్కించుకున్న తొలి చిత్రం 'ఫ్లీ'. ఇదొక డానిష్‌ యానిమేటెడ్‌ డాక్యుమెంటరీ సినిమా. జోనాస్‌ పోహెర్‌ రాస్ముస్సేన్‌ తెరకెక్కించారు. అమీన్‌ నవాబీ జీవిత కథగా సాగుతుంది. ఆఫ్గానిస్థాన్‌ నుంచి డెన్మార్క్‌కు శరణార్థిగా వచ్చిన అమీన్‌.. ఒకానొక సందర్భంలో తన గతాన్ని కాబోయే భార్యతో పంచుకోవాల్సి వస్తుంది. మరి అతని బాల్యం ఎలా గడిచింది? ఆఫ్గాన్‌ నుంచి డెన్మార్క్‌కు శరణార్థిగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటి? అన్నది దీంట్లో భావోద్వేగభరితంగా చూపించారు దర్శకుడు జోనాస్‌. ఆఫ్గానిస్థాన్‌లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను ఆధారం చేసుకొని దీన్ని రూపొందించారు.

'ద హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌' (దేశం: ఇటలీ)

Osacr Awards 2022
'ద హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌'

దర్శకుడు పాలో సోరెంటినో తన నిజ జీవితంలోని సంఘటనలను ఆధారం చేసుకొని రూపొందించిన చిత్రమే 'ద హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌'. ఫుట్‌బాల్‌ దిగ్గజం డియెగో మారడోనా 1986 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై ఓ సంచలన గోల్‌ కొట్టి అర్జెంటీనాను గెలిపించాడు. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ఆ అండర్‌ హ్యాండెడ్‌ గోల్‌కు 'హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌' (దేవుని హస్తం)అనే పేరుంది. తన దేశం మొత్తం ఈ మ్యాచ్‌ చూస్తున్న సమయంలోనే.. నేపుల్స్‌లోని మరోచోట జరిగిన ఓ సంఘటన దర్శకుడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మరి అదేంటి? అతను స్టోరీ టెల్లర్‌గా మారడానికి.. ఆ ఫుట్‌బాల్‌ గోల్‌కు ఉన్న లింకేంటి? అన్నది మిగతా చిత్ర కథాంశం. సినిమాలోని సంఘర్షణ.. దాన్ని దర్శకుడు భావోద్వేగభరితంగా ఆవిష్కరించిన తీరు అందరినీ మెప్పిస్తుంది.

'ది వరస్ట్‌ పర్సన్‌ ఇన్‌ ది వరల్డ్‌' (దేశం: నార్వే)

Osacr Awards 2022
'ది వరస్ట్‌ పర్సన్‌ ఇన్‌ ది వరల్డ్‌'

ఇదొక విభిన్నమైన డార్క్‌ రొమాంటిక్‌ కామెడీ డ్రామా సినిమా. జోచిమ్‌ ట్రైయర్‌ తెరకెక్కించారు. ఓస్లోలో లోని జూలీ అనే వైద్య విద్యార్థిని జీవిత కథగా సాగుతుంది. 30ఏళ్లు వచ్చినా జీవితంపై ఏ స్పష్టత లేని అమ్మాయి జూలీ. ప్రేమ విషయంలోనూ కన్ఫ్యూజన్‌తో ఆలోచిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె ముగ్గురు అబ్బాయిలను ప్రేమిస్తుంది. అయితే వాళ్లు తన జీవితంలోకి ప్రవేశించాక జోలీకి తన జీవితంపై ఓ స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఈ ప్రపంచంలో తన స్థానాన్ని వెతుక్కుంటూ ఆమె చేసిన ప్రయాణం ఏ దిశగా తీసుకెళ్లింది? ఈ క్రమంలో తన గురించి తాను ఏం తెలుసుకుంది? అన్నది మిగతా కథాంశం. ఈ సినిమా ఆస్కార్‌ రేసులో ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుంది.

'లూనానా: ఎ యాక్‌ ఇన్‌ ద క్లాస్‌రూమ్‌' (దేశం: భూటాన్‌)

Osacr Awards 2022
'లూనానా: ఎ యాక్‌ ఇన్‌ ద క్లాస్‌రూమ్‌'

ఓ ఆసక్తికరమైన క్లాస్‌రూమ్‌ డ్రామా కథాంశంతో రూపొందిన చిత్రమే 'లూనానా'. పావో చోయ్నింగ్‌ దోర్జీ తెరకెక్కించారు. ఆస్ట్రేలియా వెళ్లాలి.. మంచి గాయకుడిగా పేరు తెచ్చుకోవాలి అని కలలు కనే కుర్రాడు ఉగ్యెన్‌. తన అమ్మమ్మ కోరిక మేరకు ఇష్టం లేకున్నా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెడతాడు. ఈ క్రమంలోనే తన చివరి ఏడాది శిక్షణా కాలంలో భాగంగా లూనానా గ్రామంలోని స్కూల్‌లో బోధించడానికి వెళ్తాడు. అది మారుమూల కొండ ప్రాంతం. కరెంటు, నెట్‌ వంటి సదుపాయాల ఊసే కనిపించదు. అక్కడి పరిస్థితులు చూసి భయపడిన ఉగ్యెన్‌.. ఆ ఊరి వదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ, ఆ గ్రామ ప్రజలు, అక్కడి పిల్లలు తనపై చూపిస్తున్న అభిమానాన్ని.. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని చూసి వెళ్లలేకపోతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ ఊరి పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అతనేం చేశాడు? గాయకుడు కావాలన్న తన కల నెరవేరిందా? లేదా? అన్నది మిగతా కథ. ఈ సినిమా ప్రధానంగా గ్రామీణ, పట్టణ జీవితాలకు మధ్య ఉన్న వ్యత్యాసాల్ని.. నిజమైన ఆనందం.. భౌతికవాదం వంటి అంశాల్ని స్పృశిస్తూ సాగుతుంది. భూటాన్‌ నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయిన తొలి చిత్రమిదే.

ఆస్కార్‌లో.. భారతీయత

ఈ 94వ ఆస్కార్‌ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో మన దేశం నుంచి ఓ డాక్యుమెంటరీ నామినేషన్‌ దక్కించుకుంది. అదే రింటు థామస్‌, సుష్మిత్‌ ఘోష్‌ సంయుక్తంగా తెరకెక్కించిన 'రైటింగ్‌ విత్‌ ఫైర్‌'. మన దేశంలో దళిత మహిళలు నిర్వహిస్తున్న ఏకైక వార్తాపత్రిక 'ఖబర్‌ లహరియా' నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ రూపొందింది. ప్రస్తుతం ఈ విభాగంలో 'రైటింగ్‌ విత్‌ ఫైర్‌'తో పాటు 'ఫ్లీ', 'అస్సెన్షన్‌', 'అట్టికా', 'సమ్మర్‌ ఆఫ్‌ సోల్‌' డాక్యుమెంటరీలు పోటీలో ఉన్నాయి.

ఇదీ చదవండి: RRR Review: 'ఆర్​ఆర్​ఆర్'.. కుంభస్థలాన్ని బద్దలు కొట్టడం పక్కా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.