"దేశం గురించి తెలుసుకోవాలంటే ఒకొక్కళ్ల ఇంటికి వెళ్లక్కర్లేదు, రోడ్లు చెప్పేస్తాయ్ దేశం గురించి" అంటున్నాడు ఓ ట్రాఫిక్ ఎస్సై. రహదారే నా కార్యాలయం అని చెప్పే ఆ ఎస్సై గురించి తెలుసుకోవాలంటే 'ఒరేయ్ బామ్మర్ది' చూడాల్సిందే. సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్ హీరోలుగా నటిస్తున్న చిత్రమిది. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ కథానాయికలు. శశి దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్ పి.పిళ్లై నిర్మాత.
ఈ చిత్రాన్ని ఏ.ఎన్.బాలాజీ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శుక్రవారం టీజర్‌ని విడుదల చేశారు. "యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. ట్రాఫిక్ పోలీస్ అధికారిగా సిద్ధార్థ్ నటించారు. జీవీ ప్రకాశ్ బైక్ రేసర్‌గా కనిపిస్తారు. వాళ్లిద్దరూ పోటాపోటీగా నటించారు. వాళ్దిద్దరి నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకునేలా ఉంటాయి. విజయవంతమైన 'బిచ్చగాడు' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శశి, మరోసారి తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది" అన్నారు నిర్మాత ఎ.ఎన్.బాలాజీ. ఈ సినిమాకు సిద్ధూ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'పఠాన్' కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్