ETV Bharat / sitara

మహేశ్​ 'సర్కారువారి పాట' మరోసారి వాయిదా? - కీర్తిసురేశ్​ కరోనా

Sarkaruvaaripata postpone: సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించిన 'సర్కారువారి పాట' సినిమా మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆగస్టు 5న చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక-నిర్మాతలు యోచిస్తున్నారట.

mahesh babu sarkaru vaari paata release postpone
మహేశ్​ సర్కారు వారి పాట విడుదల
author img

By

Published : Jan 11, 2022, 9:41 PM IST

Sarkaruvaaripata postpone: సినిమా విడుదల షెడ్యూల్స్‌ను కరోనా కకావికలం చేస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు వాయిదా పడగా, పలువరు స్టార్స్‌ కరోనా బారినపడటం వారి సినిమాలపై ప్రభావం చూపిస్తోంది. మహేశ్‌బాబు కథానాయకుడిగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా 'సర్కారువారి పాట'. సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సినిమాను వివిధ కారణాలతో ఏప్రిల్‌ 1న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రం విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కథానాయకుడు మహేశ్‌బాబుతోపాటు, కీర్తిసురేశ్‌ కూడా కరోనా బారినపడ్డారు. ఇద్దరూ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వీరు హోం ఐసోలేషన్‌ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. పైగా మహేశ్‌కు ఇటీవల శస్త్ర చికిత్స కూడా జరిగింది. దీంతో 'సర్కారువారి పాట' చిత్రీకరణ మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్‌ 1వ తేదీకి సినిమా పూర్తయ్యే సూచనలు దాదాపు కనిపించటం లేదు. ఈ క్రమంలో సినిమా విడుదల వాయిదా వేయటం తప్ప చిత్ర బృందానికి మరో అవకాశం లేదని టాలీవుడ్‌ టాక్‌. పరిస్థితులన్నీ చక్కబడి సినిమా చిత్రీకరణ పూర్తయితే ఆగస్టు 5న విడుదల చేయాలని దర్శక-నిర్మాతలు యోచిస్తున్నారట. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: శింబుకు గౌరవ డాక్టరేట్.. ​ రవితేజ సినిమాలో సుశాంత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.