ETV Bharat / sitara

నటి జియా ఖాన్​తో మహేశ్​ భట్​ వీడియో వైరల్!​

సుశాంత్​ మృతితో బంధుప్రీతి అంశంపై బాలీవుడ్​ నిర్మాత మహేశ్​భట్​ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దివంగత నటి జియాఖాన్​తో అతను కలిసి ఉన్న ఓ పాత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. ప్రస్తుతం దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది.

mahesh bhatt
మహేశ్​ భట్​
author img

By

Published : Aug 25, 2020, 12:12 PM IST

Updated : Aug 25, 2020, 12:57 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​ కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. ప్రముఖ నిర్మాత మహేశ్​భట్​కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈమధ్య కాలంలో రియా చక్రవర్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చర్చనీయాంశమవగా.. తాజా వీడియోలో దివంగత నటి జియాఖాన్​తో సన్నిహితంగా ఉండటం కనిపించింది. అప్పుడు జియా వయసు 16 ఏళ్లుగా తెలుస్తోంది.

2004 సంవత్సరం నాటి ఆ వీడియోలో ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని.. నవ్వుతూ కనిపించారు. ఇండస్ట్రీలో మహేశ్​ నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నారని సోషల్​ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు కంగనా రనౌత్​ సినిమా ఇండస్ట్రీలో మాఫియా గురించి మాట్లాడగా.. జియా తల్లి రబియా కూడా ఈ విషయంపై స్పందించారు.

జియా 2004లో విడుదలైన 'తుమ్సా నహీన్​ దేఖా'లో ఇమ్రాన్​ హస్మి సరసన నటించాల్సి ఉంది. దీనికి మహేశ్​ సోదరుడు ముఖేశ్​ భట్​ నిర్మాత. అయితే, ఆ పాత్రకు తను న్యాయం చేయలేనని భావించి ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. ఆ తర్వాత 2007లో రామ్​గోపాల్​వర్మ తెరకెక్కించిన 'నిశ్శబ్ద్'​ చిత్రంతో జియా ఖాన్ బాలీవుడ్​లోకి అడుగుపెట్టింది.

2013, జూన్​ 3న జియా అనుమానస్పద స్థితిలో చనిపోయింది. ఈ విషయంలో నటుడు సూరజ్​ పంచోలిపై కేసు నమోదైంది. ముంబయి పోలీసులు జియా మృతిని ఆత్మహత్యగా పేర్కొంటూ.. కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని జియా తల్లి రబియా ఖాన్​ పేర్కొంది. ఇప్పుడు సుశాంత్​ కేసులోనూ అదే జరుగుతోందని ఆమె ఆరోపించారు.

Last Updated : Aug 25, 2020, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.