అతనో సాధారణ పౌరుడు. మీడియాలో యాంకర్‌గా పని చేస్తుంటాడు. అనుకోకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటర్య్వూ చేసే అవకాశం వస్తుంది. సీఎంగా పని చేయడం మాములు విషయం కాదని, కావాలంటే ఒక్క రోజు సీఎంగా పనిచేసి చూడమని ముఖ్యమంత్రి అతనికి సవాలు విసురుతాడు. ఆ ఉద్యోగి దానిని స్వీకరిస్తాడు. ఒక్కరోజులో ప్రజల కోసం ఏమేం చేయొచ్చో చేసి చూపిస్తాడు. అదే 'ఒకే ఒక్కడు' సినిమా. నేటికి విడుదలై 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు.
అప్పటికీ, ఇప్పటికీ రాజకీయ థ్రిల్లర్ చిత్రాలలో మొదటి వరుసలో నిలిచే చిత్రం 'ఒకే ఒక్కడు'. దర్శకుడు శంకర్ అద్భుతంగా తెరకెక్కించాడు. అర్జున్, మనీషా కోయిరాలా, రఘవరన్ ప్రధాన తారాగణం. ఏ.ఆర్. రెహమాన్ సంగీతమందించాడు.
ఈ చిత్రంలోని పాటలన్నీ వేటికవే ప్రత్యేకం. 'శకలక బేబి'... ఒక పాటను ఎలా చిత్రీకరిస్తారో చూపించారు. ప్రేమికుల మధ్య విరహ వేదనను 'నెల్లూరి నెరజాన' గీతంలో విశాలమైన జలపాతంలో చిత్రీకరించాడు శంకర్. 'మగధీర...ధీర' అనే పాటను అంతా సాంకేతిక మాయాజాలంతో నింపేసి ప్రేక్షకున్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.
ఈ సినిమాలోని కథ, కథనం, గీతాలు, ప్రత్యేకంగా చివరి సన్నివేశాలలో వచ్చే అనూహ్య పరిణామాలు హిట్ కావడంలో కీలక పాత్ర పోషించాయి.
ఇది చదవండి: హీరోల భాష మారింది.. టాక్ అదిరింది