జంతువుల విషయంలో మనుషుల ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఉందని అంటున్నాడు బాలీవుడ్ నటుడు, నిర్మాత జాన్ అబ్రహం. ‘మానవాళి అభివృద్ధి కోసం చెట్లను నరకడం, జంతువులను చంపడాన్ని సహించనని ప్రకృతిపై తనకున్న అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ప్రజలను సరిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపాడు.
"మన దేశంలో కుక్కల్ని చూసినపుడు అవి కరుస్తాయని చెబుతారు తప్ప విశ్వాసంలో దానిని మించింది లేదని చెప్పరు. ఇలాంటి మనస్తత్వం మారాలి. జంతువులను వేటాడటం, వాటిని రాళ్లతో కొట్టడాన్ని నేను వ్యతిరేకిస్తాను".
-జాన్ అబ్రహం, బాలీవుడ్ నటుడు
ఇలా మాటలు చెప్పడమే కాదు.. అడవులను, జంతువులను సంరక్షించాలనే ఉద్దేశంతోనే కునాల్ అవంతి రూపొందించిన 'ఐ యామ్ యానిమల్- అన్‌లీష్' వీడియోలో కనిపించి అందరినీ చైతన్యపరిచేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. అప్పుడలా అంది.. ఇప్పుడు దొరికిపోయింది