ETV Bharat / sitara

నువ్వు 'రీమేక్' అవుతానంటే నేనొద్దంటానా..! - ప్రభుదేవా దర్శకత్వం

అత్యధిక భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'. ఆరు భారతీయ భాషల్లోనే కాక రెండు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేయడం విశేషం.

Nuvvosthanante nenodhantana
నువ్వు 'రీమేక్'అవుతానంటే నేనొద్దంటానా..!
author img

By

Published : Dec 7, 2020, 9:02 AM IST

ఒక భాషలో తెరకెక్కి మంచి విజయం అందుకున్న సినిమాలను ఇతర భాషల్లో రీమేక్‌ చేయడం సర్వసాధారణం. అలాంటి కొన్ని చిత్రాల్ని రెండు, మూడు భాషల్లో రీమేక్‌ చేస్తుంటారు. మహా అయితే నాలుగైదు. కానీ, ఓ స్వచ్ఛమైన ప్రేమకథ ఏకంగా ఆరు భారతీయ భాషల్లో, రెండు ఇతర దేశాల భాషల్లో రీమేక్‌ అయిందంటే నమ్మగలమా? ఆ సినిమా మరేదో కాదు 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'.

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని సిద్ధార్థ్, త్రిష నటన ఎప్పటికీ మర్చిపోలేనిది. దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం, సిరివెన్నెల సాహిత్యం ఈ సినిమా విజయాన్ని మరో మెట్టు ఎక్కించాయి.

ఈ చిత్రం తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, హిందీ భాషలతోపాటు బంగ్లాదేశ్, నేపాల్‌లోనూ రీమేక్ చేశారు. అంతేగాక అత్యధిక బాషల్లో రీమేక్​ అయిన తెలుగు చిత్రంగా ఈ సినిమా రికార్డులు సొంతం చేసుకుంది. అత్యధిక ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్న చిత్రంగానూ ఘనత సాధించింది.

ఈ ఆల్‌టైమ్‌ హిట్‌ చిత్రానికి 5 నంది అవార్డులు, 9 ఫిలింఫేర్‌ అవార్డులు, 2 సంతోషం అవార్డులు దక్కాయి.

ఇదీ చదవండి:'పద్మావత్'​లో ప్రభాస్ అందుకే నటించలేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.