బెంగాలీ నటి, ఎంపీ నూస్రత్ జహన్.. #సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్లో పాల్గొంది. కరోనా ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకోవాలని ప్రజలకు సూచించింది. అయితే ఈ జాగ్రత్తలు చెబుతున్నంతసేపు ట్యాప్ వదిలేయడం వల్ల నీరు వృథాగా పోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు.. ఆమెను ట్రోల్ చేశారు.
శానిటైజేషన్ ముఖ్యం కానీ నీటిని పొదుపు చేయడం అంతకంటే ముఖ్యమని నూస్రత్ వీడియోకు కామెంట్ పెట్టాడో నెటిజన్. చేతులు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడం మంచిదే. అదే సమయంలో కుళాయిని వదిలేయడం బాధ కలిగించింది. వీడియోలతో ఫేమ్ తెచ్చుకునేందుకు ఇలా చేయడం సరికాదు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.