వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరో శర్వానంద్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ మూవీకి 'శ్రీకారం' అనే సంప్రదాయ టైటిల్ పెట్టారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్.. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. 14 రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాతో కిశోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఆగస్టు మొదటి వారం షూటింగ్ మొదలుకానుంది. సాయి మాధవ్ బుర్రా రచనా సహకారమందించాడు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చుతున్నాడు. సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.
ప్రస్తుతం సమంతతో ’96’ తెలుగు రీమేక్, కాజల్ హీరోయిన్గా 'రణరంగం' చిత్రాల్లో నటిస్తున్నాడు హీరో శర్వానంద్.
ఇది చదవండి: శర్వాకు బలమైన గాయాలు.. షూటింగ్‌లో ప్రమాదం