ETV Bharat / sitara

NTR Car Number: ఆ కారు నంబరు కోసం ఎన్టీఆర్​ ఎంత ఖర్చు చేశారంటే? - ఎన్టీఆర్ లాంబొర్గిని నంబరు

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ గ్యారేజ్​లోకి విలాసవంతమైన లాంబొర్గిని(NTR Lamborghini) ఇటీవలే వచ్చి చేరింది. ఇప్పుడు ఈ కారు నంబర్​(NTR Car Number) కోసం తారక్​.. ఏకంగా రూ.17 లక్షలు ఖర్చుచేశారట! అసలు కారు నంబరు ఎందుకు అంత ఖర్చు? తారక్​ ఎంచుకున్న నంబర్​ ఏంటో తెలుసుకుందాం.

NTR Spents Rs 17 lakhs for his New Lamborghini car number
NTR Car Number: ఆ కారు నంబరు కోసం ఎన్టీఆర్​ ఎంత ఖర్చు చేశారంటే?
author img

By

Published : Sep 23, 2021, 7:42 AM IST

స్టార్​ హీరో​ ఎన్టీఆర్​కు కార్లంటే(NTR Car Collection) ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఆయన గ్యారేజ్​లో రకరకాల కార్లు దర్శనమిస్తాయి. ఇటీవలే తన గ్యారేజ్​లోకి మరో కారు​(NTR Lamborghini) అడుగుపెట్టింది. విలాసవంతమైన స్పోర్ట్స్​ కార్లకు కేరాఫ్​ అయిన లాంబొర్గిని (Lamborghini urus Graphite Capsule) కారును తారక్​ ఇటీవల కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ కారు నంబరు(NTR Car Number) గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది.

ఈ కారు కోసం TS09 FS 9999 నంబర్‌ను(NTR Car Number Plate) హీరో జూనియర్ ఎన్టీఆర్‌ వేలంలో సొంతం చేశారని ఖైరతాబాద్​ రవాణా శాఖ కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. తారక్​.. తన లక్కీ నంబర్​ '9'తో ఉన్న కలిసున్న కారు నంబరును కొనుగోలు చేసేందుకు ఏకంగా రూ.17 లక్షలతో సొంతం చేసుకున్నారని అధికారి తెలిపారు.

ఎన్టీఆర్​ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్​' చిత్రంలో(RRR Movie news) నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో తారక్​.. అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్​ నటిస్తున్నారు. అలియా భట్​, ఒలివియా మోరిస్​ కథానాయికలు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు(RRR Movie Cast and Crew) కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి.. ఎన్టీఆర్​ గ్యారేజ్​లో లగ్జరీ కారు.. దేశంలో ఇదే మొదటిది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.