యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. రెండు వారాలుగా డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపిన తారక్.. ఈ కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
-
Happy to state that I've tested negative for Covid 19. Thank you everyone for all the wishes 🙏🏻
— Jr NTR (@tarak9999) May 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
I'd like to take this opportunity to thank my doctors -Dr Praveen Kulkarni & my cousin Dr Veeru from KIMS Hospitals,as well as Tenet Diagnostics. Their excellent care helped me a lot
">Happy to state that I've tested negative for Covid 19. Thank you everyone for all the wishes 🙏🏻
— Jr NTR (@tarak9999) May 25, 2021
I'd like to take this opportunity to thank my doctors -Dr Praveen Kulkarni & my cousin Dr Veeru from KIMS Hospitals,as well as Tenet Diagnostics. Their excellent care helped me a lotHappy to state that I've tested negative for Covid 19. Thank you everyone for all the wishes 🙏🏻
— Jr NTR (@tarak9999) May 25, 2021
I'd like to take this opportunity to thank my doctors -Dr Praveen Kulkarni & my cousin Dr Veeru from KIMS Hospitals,as well as Tenet Diagnostics. Their excellent care helped me a lot
"నాకు కరోనా నెగిటివ్‌గా తేలిందని తెలిపేందుకు సంతోషిస్తున్నా. మీ ప్రార్థనలకు కృతజ్ఞతలు. నా ట్రీట్మెంట్కు సహకరించిన డా. ప్రవీణ్ కులకర్ణి, కిమ్స్ డాక్టర్, నా కజిన్ డా.వీరు, టెనెట్ డయాగ్నస్టిక్స్‌కు ధన్యవాదాలు. మీరంతా నా పట్ల చాలా శ్రద్ధ తీసుకుని కోలుకోవడంలో సాయం చేశారు. కరోనాను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తగిన శ్రద్ధ, పాజిటివ్ దృక్పథంతో ఈ వ్యాధిపై గెలవచ్చు. వైరస్‌పై పోరాటంలో మీ శక్తి ప్రధాన అస్త్రం. ధైర్యంగా ఉండండి. భయపడకండి. మాస్క్ ధరించండి. ఇంట్లోనే ఉండండి."
-తారక్, నటుడు
మే 10న కరోనా బారినపడ్డారు తారక్. అప్పటి నుంచి ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నారు. డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.